Share News

Viral Video: ఈ తాత చాలా కసిగా ఉన్నాడు.. లుంగీ కట్టుకుని జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-10-15T16:03:15+05:30 IST

కొద్ది మంది విషయంలో వయసు అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే. అభిరుచి కలిగి ఉండడానికి వయసుతో పని లేదు. మనం బాగా ఇష్టపడుతున్నదాన్ని చేయకుండా వయస్సు ఆపలేదు. ఫలానా వయసులోనే అలాంటి పనులు చేయాలనే నిబంధనలు ఏవీ లేవు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మీరు కూడా నిజం అని అంగీకరిస్తారు.

Viral Video: ఈ తాత చాలా కసిగా ఉన్నాడు.. లుంగీ కట్టుకుని జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు.. వీడియో వైరల్

కొద్ది మంది విషయంలో వయసు (Age) అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే. అభిరుచి కలిగి ఉండడానికి వయసుతో పని లేదు. మనం బాగా ఇష్టపడుతున్నదాన్ని చేయకుండా వయస్సు ఆపలేదు. ఫలానా వయసులోనే అలాంటి పనులు చేయాలనే నిబంధనలు ఏవీ లేవు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)చూస్తే మీరు కూడా నిజం అని అంగీకరిస్తారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వృద్ధుడు (Old man gym Video).. కుర్రాళ్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో చెమటలు చిందిస్తున్నాడు.

crazygymlover1060 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఆ వీడియోలో ఓ 85 ఏళ్ల వృద్ధుడు లుంగీ (Lungi)ధరించి జిమ్‌లో కష్టపడుతున్నాడు. కుర్రాళ్లకు తీసిపోని రీతిలో అన్ని రకాల వర్కవుట్లూ (Workouts) చేస్తున్నాడు. అతని స్టైల్, లుక్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. 85 ఏళ్ల వయసులో అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. పది లక్షల మంది కంటే పైగా ఆ వీడియోను లైక్ చేశారు.

Anand Mahindra: పాక్‌పై భారత్ గెలుపు.. నాకు ఇలా డ్యాన్స్ చేయాలని ఉందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్..

ఆ వైరల్ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందనలు తెలియజేశారు. ``తాతగారూ.. ఏం తింటున్నారు``, ``ఈయన కుర్రాళ్లకూ కూడా స్ఫూర్తి కలిగిస్తున్నారు``, ``ఆయన 85 ఏళ్ల కుర్రాడు``, ``జాగ్రత్త దాదా, కాస్త విశ్రాంతి తీసుకో``, ``ఈ వయసులో ఇంత కష్టం ఎందుకు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-10-15T16:03:15+05:30 IST