Shocking Video: భయస్థులు ఈ వీడియో చూడకండి.. ఓ కొండచిలువను మరకొటి ఎలా మింగేస్తోందో.. షాకింగ్ వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-09-10T11:32:33+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వన్య ప్రాణులకు సంబంధించిన ఎన్నో వీడియోలు తరచుగా మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు బాగా ఎక్కువ హల్‌చల్ చేస్తున్నాయి. పాములకు సంబంధించిన రకరకాల వీడియోలు తరచుగా అప్‌లోడ్ అవుతున్నాయి.

Shocking Video: భయస్థులు ఈ వీడియో చూడకండి.. ఓ కొండచిలువను మరకొటి ఎలా మింగేస్తోందో.. షాకింగ్ వీడియో వైరల్!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వన్య ప్రాణులకు (Wild Animal Videos) సంబంధించిన ఎన్నో వీడియోలు తరచుగా మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా పాములకు (Snake Videos) సంబంధించిన వీడియోలు బాగా ఎక్కువ హల్‌చల్ చేస్తున్నాయి. పాములకు సంబంధించిన రకరకాల వీడియోలు తరచుగా అప్‌లోడ్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు. ఆ వీడియోలో రెండు కొండచిలువల మధ్య భీకర పోరాటం జరుగుతోంది (One python swallows another).

snake__videos అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రెండు కొండచిలువలు పట్టు వదలకుండా పోరాడుతున్నాయి. ఒకదానిని మరొకటి మింగేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో ఒక కొండ చిలువ మరొకదానిని మింగేస్తోంది. దాదాపు సగం వరకు మింగేసింది. ఈ భయంకర వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు (Shocking Video).

Viral Video: మన కళ్లే మనల్ని మోసం చేస్తున్నాయా? వైరల్ అవుతున్న సూపర్ మ్యాజిక్ ట్రిక్.. వీడియో వైరల్!

ఈ వీడియోను ఇప్పటివరకు 2.4 లక్షల మంది వీక్షించారు. 8 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఈ వీడియో చూడాలంటే చాలా ధైర్యం కావాలి``, ``పాములకు, కొండచిలువలకు ఆకలి వేసినపుడు తమ జాతి వాటినే తినేస్తాయి``, ``షాకింగ్ వీడియో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-10T14:55:16+05:30 IST