Flight: విమానంలోకి ఎక్కగానే సీట్లన్నీ ఖాళీ.. ఎవరూ రాలేదేంటని అతడు అడిగితే సిబ్బంది చెప్పింది విని షాక్..

ABN , First Publish Date - 2023-04-14T16:50:27+05:30 IST

విమానం ఎక్కడమే గొప్ప. అలాంటిది ఒక్కడి కోసం విమానం నడపమంటే మామూలు విషయమా? ఇది కథ కాదు. అక్షరాలా నిజం. ఒక్క ప్రయాణికుడి కోసం 8 గంటలు ప్రయాణం చేసింది ఓ విమానం. ఎక్కడా? ఏంటో తెలియాలంటే

Flight: విమానంలోకి ఎక్కగానే సీట్లన్నీ ఖాళీ.. ఎవరూ రాలేదేంటని అతడు అడిగితే సిబ్బంది చెప్పింది విని షాక్..
Only passenger

విమానం ఎక్కడమే గొప్ప. అలాంటిది ఒక్కడి కోసం విమానం నడపమంటే మామూలు విషయమా? ఇది కథ కాదు. అక్షరాలా నిజం. ఒక్క ప్రయాణికుడి కోసం 8 గంటలు ప్రయాణం చేసింది ఓ విమానం. ఎక్కడా? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

విమాన ప్రయాణమంటే మంచి థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చాలా మందికి విమానంలో ప్రయాణం చేయాలని కోరిక ఉంటుంది. కానీ అందరికీ అది సాధ్యం కాదు. బస్సు.. రైల్లో ప్రయాణం చేసిన అనుభూతి ఉండొచ్చేమో గానీ ఫ్లైట్‌లో విహరించిన అనుభూతి మాత్రం అందరికీ ఉండదు. సాధారణంగా విమానాల్లో జర్నీ అంటే ఆర్థిక స్తోమత కలిగిన వారే ఎక్కువ ప్రయాణం చేస్తుంటారు. కానీ అతడు మాత్రం ఒక్క టికెట్‌తో విమానంలో సింగిల్‌గా ప్రయాణం చేసి వార్తల్లో నిలిచాడు.

సహజంగా బస్సుల్లో గానీ.. ఆటోల్లో గానీ ప్రయాణం చేసేటప్పుడు సరిపడా ప్రయాణికులు లేకపోతే గిట్టుబాటు కాదేమోనని వెంటనే వేరే వాహనాల్లో షిప్ట్ చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు మనలో చాలా మందికి ఎదురై ఉంటాయి. వాహనాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. అలాంటిది ఒక్క ప్రయాణికుడి కోసం విమానం నడపడమంటే మామూలు విషయమా? కానీ ఇది నిజం. ఈ సంఘటన యూకే (UK)లో చోటుచేసుకుంది.

పాల్ విల్కిన్ సన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులను కలిసేందుకు పోర్చుగల్ నుంచి ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌కు వెళ్లేందుకు ఫ్లైట్ (international flight) టికెట్ బుక్ చేసుకున్నాడు. సమయానికి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. కానీ విమానాశ్రయంలో ఎవరూ లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. విమానం వెళ్లిపోయిందా? లేదంటే అందరి కంటే ముందు వచ్చేశానా? అని సందేహించాడు. అనుమానంతో సిబ్బందిని అడిగాడు. కానీ విమాన సంస్థ సిబ్బంది షాకింగ్ విషయం చెప్పారు. ఈరోజు ఈ విమానంలో మీరొక్కరే ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఈరోజు మాకు వీఐపీ అంటూ బదులిచ్చారు. దీంతో ఆ ప్రయాణికుడు ఒకింతా ఆశ్చర్యానికి గురయ్యాడు.

విషయమేంటంటే ఆరోజు బెల్‌ఫాస్ట్‌కు వెళ్లేందుకు పాల్ విల్కిన్ సన్ ఒక్కడే టికెట్ బుక్ చేసుకున్నాడు. అతని తప్ప ఇంకెవరూ బుక్ చేసుకోలేదు. దీంతో అతనొక్కడే విమానం (Flight)లో వీఐపీలా ప్రయాణించాడు. ఇక విమానం ఎక్కాక.. సిబ్బందిని అడిగి తనకు నచ్చిన సీట్లో కూర్చుని సంబరపడ్డాడు. అంతేకాదు సిబ్బందితో ఫొటోలకు ఫోజులిచ్చి ముచ్చట తీర్చుకున్నాడు. అందరితో కలిసి సరదాగా గడిపాడు.

పోర్చుగల్ నుంచి బెల్‌ఫాస్ట్‌కు 8 గంటల సమయం (8 hour) పడుతుంది. ఒక్కో ప్రయాణికుడికి (Only passenger) ఫ్లైట్ ఛార్జీ 162 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం రూ.13,000. కానీ విమానం మొత్తాన్ని బుక్ చేసుకుంటే 28,000 డాలర్లు ఖర్చు అవుతుంది. కానీ అతను కేవలం ఒకే ఒక్క టికెట్‌తో వీఐపీలా దర్జాగా విమానంలో ప్రయాణం చేసి ఎంజాయ్ చేశాడు.

ఈ ప్రయాణం తనకు అద్భుతంగా అనిపించిందని పాల్ విల్కిన్ సన్ తెలిపాడు. సొంత విమానంలో ప్రయాణం చేసిన అనుభూతి పొందినట్లు అతడు సంతోషం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే తమ ప్రయాణికుడు అవార్డు విన్నింగ్ కస్టమర్ సేవల అనుభూతి పొందినందుకు ఆనందంగా ఉందని విమాన సంస్థ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Viral News: ఏం తెలివిరా బాబూ.. ప్రేయసి మైనర్.. పెళ్లయ్యాక ఇబ్బందులు రాకూడదని 23 ఏళ్ల కుర్రాడి వింత నిర్వాకం.. పెళ్లికి ముందే..!

Updated Date - 2023-04-14T16:50:27+05:30 IST