Viral: తమ భార్యలు కనిపించడం లేదంటూ 12 మంది భర్తల ఫిర్యాదులు.. వారు ఇచ్చిన ఫొటోలు చూసి పోలీసులకు మైండ్ బ్లాక్!
ABN , First Publish Date - 2023-07-16T20:20:29+05:30 IST
ప్రస్తుతం కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా మగపిల్లల పెళ్లిళ్లు చేయడం కష్టసాధ్యంగా మారిపోయింది. అమ్మాయిల జనాభా తగ్గిపోవడంతో మగవారికి పెళ్లి కావడం కష్టంగా మారపోయింది. దీంతో మగవారే ఎదురు డబ్బులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా మగపిల్లల పెళ్లిళ్లు చేయడం కష్టసాధ్యంగా మారిపోయింది. అమ్మాయిల జనాభా తగ్గిపోవడంతో మగవారికి పెళ్లి (Marriage) కావడం కష్టంగా మారపోయింది. దీంతో మగవారే ఎదురు డబ్బులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాంటి వారి బలహీనతను క్యాష్ చేసుకునేందుకు కొన్ని ఛీటింగ్ గ్యాంగ్‌లు పుట్టుకొస్తున్నాయి. వివాహ బంధాలను అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్న వధువుల (Cheating Bride) గురించి ఎన్నో కథలు వస్తున్నాయి.
తాజాగా జమ్మూ, కశ్మీర్‌కు (Jammu and Kashmir) చెందిన ఓ వధువు ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకుని అందరినీ మోసం చేసింది. వారిలో 12 మంది జమ్మూ, కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఫిర్యాదులు చేశారు. వారు ఇచ్చిన ఫొటోలు చూసి పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. వారందరినీ విచారించగా అందరూ దాదాపు ఒకటే కథ చెప్పారు. మధ్యవర్తి ద్వారా సంప్రదించడం, పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజులు కాపురం చేశాక ఏదోక కారణం చెప్పి డబ్బు, బంగారంతో పరారు కావడం. బాధిత వ్యక్తులందరూ ఇదే కథ చెప్పారు (Crime News).
Viral Video: నెమలి ఈక ఇంత అద్భుతంగా ఉంటుందా? నెమలి ఈకను మైక్రోస్కోపు కింద పెట్టి చూస్తే.. వైరల్ అవుతున్న వీడియో!
ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో ఆ మహిళ గురించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ మహిళ 12 మందిని కాదు, 27 మందిని వివాహం చేసుకున్నట్టు తేలింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదైనట్టు తెలుసుకున్న పోలీసులు ఆ కిలేడీని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.