Viral: అతడిది పాకిస్థాన్.. ఆమెది బంగ్లాదేశ్.. వారి కొడుకును మాత్రం `ఇండియా` అని పిలుస్తున్నారు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2023-01-31T15:32:41+05:30 IST

పిల్లలు చిన్నగా ఉన్నపుడు వారిని కనిపెట్టుకుని ఉండడం, వారిని నిద్రపుచ్చడం తేలికైన విషయాలు కావు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో వారి నిద్ర లేస్తే వారిని లాలించి, జోకొట్టి నిద్ర పుచ్చాలి. పిల్లలు కొంచెం పెద్దవారయ్యే వరకు ఏ తల్లిదండ్రులకైనా ఇలాంటి కష్టాలు తప్పవు.

Viral: అతడిది పాకిస్థాన్.. ఆమెది బంగ్లాదేశ్.. వారి కొడుకును మాత్రం `ఇండియా` అని పిలుస్తున్నారు.. అసలు కథేంటంటే..

పిల్లలు చిన్నగా ఉన్నపుడు వారిని కనిపెట్టుకుని ఉండడం, వారిని నిద్రపుచ్చడం తేలికైన విషయాలు కావు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో వారి నిద్ర లేస్తే వారిని లాలించి, జోకొట్టి నిద్ర పుచ్చాలి. పిల్లలు కొంచెం పెద్దవారయ్యే వరకు ఏ తల్లిదండ్రులకైనా ఇలాంటి కష్టాలు తప్పవు. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తమ ముద్దుల కొడుకుకు సంబంధించిన ఫన్నీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది (Pakistani-Bangladeshi couple names their son 'India').

పాకిస్తానీ సంగీతకారుడు ఒమర్ ఈసా (Pakistani musician Omar Esa).. తమ కొడుకు తమతో ఎలా ఆడుకుంటున్నాడో సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటలో ఒమర్, అతని భార్య కూర్చుని ఉండగా, మధ్యలో వారి కొడుకు పడుకుని ఉన్నాడు. ఈ ఫొటో పోస్ట్ చేసిన ఒమర్.. తమ కష్టాలను వివరించారు (Pakistani-Bangladeshi couple). `కొత్తగా తల్లిదండ్రులైన వారికి వార్నింగ్. మా లాగే తప్పు చేసి ఇబ్బందులు పడుతున్న వారికి మా సానుభూతి. మా మొదటి కొడుకు ఇబ్రహీం పుట్టినపుడు మేం వాడిని మా మధ్యలో పడుక్కోబెట్టే వాళ్లం. వాడు పెద్దైనా సరే మమ్మల్ని వదలడం లేదు. వాడికి ప్రత్యేకంగా బెడ్రూమ్ ఉన్నా మా మధ్యలోనే నిద్రపోతున్నాడు.

నేను పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని. నా భార్య బంగ్లాదేశీ. మా మధ్య పడుక్కుని మమ్మల్ని వేరు చేస్తున్న మా ఇబ్రహీంకు ఇండియా అని కొత్తగా పేరు పెట్టాం. వాడిని ఇండియా (India) అనే పిలుస్తున్నాం. వాడు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడ`ని ఒమర్ పేర్కొన్నారు. ఒమర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు (Viral News).

Updated Date - 2023-01-31T15:32:43+05:30 IST