Female Constable: హోటల్‌లో భార్య దారుణ హత్య.. నాకేం తెలియదంటూనే పోలీసుల ముందు లొంగిపోయిన భర్త.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!
ABN , First Publish Date - 2023-10-30T16:02:43+05:30 IST
ఆమె బీహార్ పోలీసు శాఖలో కానిస్టేబుల్.. అతడు ఓ స్కూల్‌లో ఉపాధ్యాయుడు.. ఏడేళ్ల క్రితం ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.. వీరికి ఓ పాప కూడా ఉంది.. ఎంతో సంతోషంగా సాగిపోతున్న జీవితంలో ఓ వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.. తోటి ఉద్యోగితో ఆమె సాగించిన ఎఫైర్ అన్నో అనర్థాలకు కారణమైంది..
ఆమె బీహార్ (Bihar) పోలీసు శాఖలో కానిస్టేబుల్.. అతడు ఓ స్కూల్‌లో ఉపాధ్యాయుడు.. ఏడేళ్ల క్రితం ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.. వీరికి ఓ పాప కూడా ఉంది.. ఎంతో సంతోషంగా సాగిపోతున్న జీవితంలో ఓ వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.. తోటి ఉద్యోగితో ఆమె సాగించిన ఎఫైర్ (Love Affair) అన్నో అనర్థాలకు కారణమైంది.. భర్తను (Husband) చంపాలని నిర్ణయించుకుంది.. చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయింది.. హోటల్‌లో దారుణ హత్యకు గురైంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి నిందితుడిని పట్టుకున్నారు (Crime News).
బీహార్ రాజధాని పాట్నాలోని ఓ హోటల్‌లో ఈ నెల 20వ తేదీన ఓ మహిళ హత్యకు గురైంది. ఆమె మహిళా పోలీసు (Female Constable) అయిన 21 ఏళ్ల శోభా కుమారి అని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మొదట ఆమె భర్త గజేంద్రను విచారించి అతడికేమీ తెలియదని వదిలేశారు. అయితే చివరకు అతడే నిందితుడని తేలింది. శోభకు తోటి కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరూ తరచుగా కలుస్తుండేవారు. ఈ విషయం తెలుసుకున్న గజేంద్ర పలుసార్లు శోభను హెచ్చరించాడు. అయినా ఆమె తీరు మారలేదు. చివరకు శోభ తన భర్తను చంపాలని నిర్ణయించుకుంది (Husband killed wife).
Indian Railway: రైళ్ల మీద పిడుగు పడితే జరిగేదేంటి..? ఎంత వర్షం వస్తున్నా సరే.. రైళ్లు ఎందుకు ఆగవంటే..!
ఈ నెల 20వ తేదీన తన భర్తకు ఫోన్ చేసి హోటల్‌కు రావాలని అడిగింది. వెంటనే గజేంద్ర ఆమె చెప్పిన హోటల్‌కు వెళ్లాడు. హోటల్ కి రాగానే శోభ బ్యాగ్ లోంచి పిస్టల్ తీసి భర్త వైపు గురి పెట్టింది. షాకైన గజేంద్ర భార్యను ఆపేందుకు ప్రయత్నించాడు. ఇద్దరూ ఒకరినొకరు తోసుకున్నారు. చివరకు తుపాకీ పేలి శోభ అక్కడికక్కేడే మరణించింది. భయపడిన గజేంద్ర పరారయ్యాడు. చివరకు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగింది చెప్పి లొంగిపోయాడు.