Share News

Indian Railways: ట్రైన్ ఆలస్యం.. రైల్వే శాఖపై రూ.60 వేల ఫైన్ వేసిన కోర్టు

ABN , First Publish Date - 2023-10-28T08:31:08+05:30 IST

కేరళ(Kerala) రాష్ట్రం ఎర్నాకులం కు చెందిన కార్తిక్ మోహన్ చెన్నెైలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన చెన్నైలోని ఓ మీటింగ్ కు హాజరుకావాలని ఎర్నాకులం(Ernakulam) నుంచి చెన్నైకి వెళ్లే అలప్పుజా-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ట్రైన్ 13 గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆయన మీటింగ్ కు హాజరుకాలేకపోయాడు. కోపోద్రిక్తుడైన ప్రయాణికుడు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు.

Indian Railways: ట్రైన్ ఆలస్యం.. రైల్వే శాఖపై రూ.60 వేల ఫైన్ వేసిన కోర్టు

తిరువనంతపురం: సాధారణంగా ట్రైన్ల ఆలస్యంపై ప్రయాణికుల ఫిర్యాదులు అన్నీ ఇన్నీ కావు.. ఒక్కో ట్రైన్ కొన్ని గంటలపాటు ఆలస్యంగా నడిచిన రోజులు ప్రయాణికుల అనుభవంలో ఉన్నవే. అర్జంట్ పనుల మీద వెళ్లాల్సి వచ్చిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పేవి కావు. కానీ రైల్వే శాఖకు ఎన్ని ఫిర్యాదులు అందినా ఏం చేయలేని పరిస్థితి. కానీ ఓ ప్రయాణికుడు ట్రైన్ ఆలస్యం(Indian Railways) వల్ల తనకు జరిగిన నష్టంపై కోర్టును ఆశ్రయించాడు. అంతేకాకుండా భారత రైల్వే శాఖ నుంచి నష్టపరిహారాన్ని పొంది వార్తల్లో నిలిచాడు. ఇంతకు ఏం జరిగిందంటే.. కేరళ(Kerala) రాష్ట్రం ఎర్నాకులం కు చెందిన కార్తిక్ మోహన్ చెన్నెైలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.


ఆయన చెన్నైలోని ఓ మీటింగ్ కు హాజరుకావాలని ఎర్నాకులం(Ernakulam) నుంచి చెన్నైకి వెళ్లే అలప్పుజా-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ట్రైన్ 13 గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆయన మీటింగ్ కు హాజరుకాలేకపోయాడు. కోపోద్రిక్తుడైన ప్రయాణికుడు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు వివరాలు పరిశీలించిన అనంతరం.. ప్రయాణికుడి అసంతృప్తికి కారణమై, ఆర్థిక నష్టం చేసిన రైల్వే శాఖకు రూ.60 వేల ఫైన్ వేస్తున్నట్లు తీర్పునిచ్చింది. వెంటనే ఆ పరిహారాన్ని బాధితుడికి ఇవ్వాలని కన్స్యూమర్ కోర్ట్ స్పష్టం చేసింది. ఈ తీర్పుతో బాధితుడు ఊరట పొందాడు. అయితే అదే రోజు ట్రైన్ ఆలస్యంతో నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు సైతం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారని తమకు న్యాయం జరగాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చెన్నై(Chennai) డివిజన్ లోని అరక్కోణం వద్ద పునర్నిర్మాణ పనుల కారణంగా రైలు ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. సంబంధిత విషయాన్ని అప్పటికే ప్రయాణికులకు మెసేజ్ ల రూపంలో పంపినట్లు తెలిపారు. రైల్వే శాఖ వాదన విన్న కోర్టు..'ప్రయాణికుల విలువైన సమయం వృథా చేయడం కరెక్ట్ కాదు. అనుకోని ఆలస్యం వల్ల వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రభావితం అయ్యారు. అందులో స్టూడెంట్స్ కూడా ఉన్నారు. రైల్వేలు సమయపాలన పాటించాలి' అని తీర్పులో పేర్కొంది.

Updated Date - 2023-10-28T08:31:34+05:30 IST