Peacock Eggs: నెమలి గుడ్లను చోరీ చేస్తున్న మహిళ.. ఒకటికి నాలుగు గుడ్లను చేతిలోకి తీసుకున్నాక ఊహించని సీన్..!

ABN , First Publish Date - 2023-07-12T17:05:30+05:30 IST

మూగజీవులు ఏమీ చేయలేవనే ఆలోచన మనిషిది. ఈ మహిళ అలాగే అనుకుంది కాబోలు..

Peacock Eggs: నెమలి గుడ్లను చోరీ చేస్తున్న మహిళ.. ఒకటికి నాలుగు గుడ్లను చేతిలోకి తీసుకున్నాక ఊహించని సీన్..!

మనిషి తనకంటే చిన్నవారి మీదా, జీవజాతుల మీద ఆదిపత్యం చలాయించాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. అందులో భాగంగా పేదవారిని, పశుపక్ష్యాదులను హింసిస్తూ వాటిని దోచుకుంటూ ఉంటాడు. ఓ మహిళ ఏకాంతంగా గుడ్లు పొదుగుతున్న నెమలి దగ్గరకు వెళ్లి గుడ్లు దొంగిలిస్తోంది. ఒకటికి నాలుగు గుడ్లను చేతిలోకి తీసుకోగానే అక్కడ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఈ హఠాత్పరిణామానికి ఆ మహిళ ఉలిక్కిపడింది. అసలక్కడ జరిగిందేంటో చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మూగజీవులు ఏమీ చేయలేవనే ఆలోచన మనిషిది. ఈ మహిళ అలాగే అనుకుంది కాబోలు.. వీడియోలో అడవిలో(forest) ఏకాంతంగా గుడ్లు పొదుగుతున్న ఓ ఆడ నెమలి(female Peacock) కనిపిస్తుంది. ఆ నెమలికి వెనుక వైపు నుండి ఓ మహిళ(Women) చప్పుడు చేయకుండా రావడం గమనించవచ్చు. గుడ్లు పొదగడంలో లీనమైపోయిన ఆ నెమలి మహిళ వస్తున్న విషయం గమనించలేదు. ఆ మహిళ నెమలికి ఇరువైపులా ఉన్న గుడ్లను ఆత్రంగా ఒకటికి బదులు నాలుగు గుడ్లను చేతిలోకి తీసుకుంది(women theft peacock eggs). ఆమె ఇంకా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉహించని సంఘటన చోటుచేసుకుంది. ఎలా చూసిందో ఏమో గానీ మగ నెమలి(male peacock) ఆడనెమలి పక్కనున్న గుడ్లను మహిళ దొంగిలించడం చూసింది. ఆ మగ నెమలి కోపంతో రగిలిపోతూ వేగంగా ఎగురుతూ వచ్చి మహిళ మీద దాడి చేసింది. అది తన కాళ్ళతో మహిళను బలంగా తన్ని, గోళ్ళతో రక్కింది. మగ నెమలి దెబ్బకు ఆ మహిళ ఎత్తైన ప్రదేశం నుండి కిందకు దొర్లుకుంటూ పడింది. భయంటో అక్కడినుండి పారిపోయింది. కానీ ఈ సంఘటనలో నెమలి గుడ్లు చెల్లాచెదురయ్యాయి. కొన్ని గుడ్లు దొర్లుకుంటూ కిందకు వెళ్ళి పడ్డాయి.

Ambani Family: అంత పెద్ద ఇంద్రభవనంలో అన్నీ వదిలేసి.. 27వ అంతస్తులోనే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఉండటం వెనుక..!


ఈ వీడియోను motivation4u_offical అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళను నిందిస్తున్నారు. 'నెమలి గుడ్లను చోరీ చేస్తూ ఆ మహిళ మంచి గుణపాఠం నేర్చుకుంది. జీవితంలో మళ్లీ అలాంటి పనిచేయకపోవచ్చు' అని ఒకరు కామెంట్ చేశారు. 'నెమలి తన గుడ్లను చోరీ చేస్తుంటే చూస్తూ ఊరికే ఉంటాయా? పిల్లల జోలికొస్తే ప్రతి తల్లీ యోధురాలు అవుతుంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'ఆ మహిళకు తగిన శాస్తి జరిగింది' అని నెటిజన్లు అంటున్నారు.

Viral Video: ఏం పనులమ్మా ఇవీ.. నడిరోడ్డుపై ఈ నిర్వాకాలేంటి..? వీడియోను చూస్తోంటేనే గుండె ఆగిపోయేట్టుందిగా..!


Updated Date - 2023-07-12T17:05:30+05:30 IST