Periods Pain: నెలసరి సమయంలో విపరీతమైన నొప్పి బాధిస్తోందా? ఇదొక్క టిప్ పాటిస్తే చాలు దెబ్బకు నొప్పి మాయం..

ABN , First Publish Date - 2023-05-21T20:14:44+05:30 IST

నెలసరి సమయంలో వచ్చే నొప్పి సహజమైనదే అయినా దాన్ని భరించడం నరకంలా ఉంటుంది. దాన్ని తగ్గించడానికి ఎంతో సులువైన ఈ చిట్కా పాటిస్తే చాలు..

Periods Pain:  నెలసరి సమయంలో విపరీతమైన నొప్పి బాధిస్తోందా? ఇదొక్క టిప్ పాటిస్తే చాలు దెబ్బకు నొప్పి మాయం..

ఆడవాళ్ళకు నెలసరి సమయంలో(periods) కలిగే ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలే హార్మోన్ల ప్రభావం(hormones effect) వల్ల నెలసరి సమయంలో కోపం, చిరాకు, అసహనం వంటి మూడ్ ఛేంజెస్ తో సతమవుతుంటారు. వీటికి తోడు నెలసరి సమయంలో విపరీతమైన పొత్తి కడుపునొప్పి(abdominal pain) వస్తుంటుంది. ఈ నొప్పి చాలా సహజమైనదని, దీనికోసం ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకూడదని వైద్యులు చెబుతారు. అలాగని దాన్ని భరిస్తూ ఉండటం నరకమే.. ఈ నొప్పిని తగ్గించడానికి చాలా సులువైన చిట్కా ఉంది. రోజూ వంటల్లో ఉపయోగించే ఇంగువతో(Asafoetida) నెలసరి నొప్పిని(Periods pain) తరిమికొట్టవచ్చు. దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులువు. కేవలం నెలసరి నొప్పి మాత్రమే కాదు, ఇంగువ వల్ల మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నెలసరి నొప్పి తగ్గించుకోవడానికి ఇంగువ ఎలా ఉపయోగించాలి? దాని ఇతర ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటే..

పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పికి ఇంగువ అద్బుతంగా పనిచేస్తుంది. గ్లాసుడు గోరువెచ్చని(glass Luke warm water) నీటిలో కొద్దిగా అల్లం పొడి(ginger powder), చిటికెడు ఇంగువ(Asafoetida), కాసింత రాళ్ళ ఉప్పు(rock salt) కలపాలి. దీన్ని గోరువెచ్చగా ఉన్నట్టే తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి చాలా తొందరగా తగ్గిపోతుంది. అలాగే నెలసరి సమయంలో ఉండే కడుపు ఉబ్బరం(stomach bloating) కూడా తగ్గుతుంది.

Viral Video: బైక్ మీద వెళ్ళే టప్పుడు వెధవ్వేషాలు వెయ్యకూడదు అనేది ఇందుకే.. యమా జోష్ గా వెళుతున్న ఈ కుర్రాళ్ళకు ఏం జరిగిందో మీరే చూడండి..


తలనొప్పి, మైగ్రేన్(Head ache, migraine) తో బాధపడేవారికి కూడా ఇంగువ తక్షణ ఫలితాన్ని ఇస్తుంది. రెండు కప్పుల నీటిని సన్నని మంట మీద వేడి చేయాలి. ఈ నీటిలో చిటికెడు ఇంగువ వేసి 10నుండి 15నిమిషాల పాటు మరిగించాలి(boil 10to15 minutes). 2కప్పుల నీరు కాస్తా ఒక కప్పు మోతాదు వచ్చాక ఆ నీటిని రోజులో మూడు నుండి నాలుగు సార్లు కొద్ది కొద్దిగా తాగుతుంటే భరించలేని మైగ్రేన్ కూడా తగ్గుతుంది. ఇది మాత్రమే కాదు, కొద్దిగా రోజ్ వాటర్ లో కాసింత ఇంగువ కలిపి పేస్ట్ లా(rose water, asafoetida paste) చేయాలి. దీన్ని నుదురుమీద రాసుకోవాలి. తలనొప్పినుండి చాలా తొందరగా ఉపశమనం లభిస్తుంది.

చెవినొప్పి(ear pain) ఎక్కువగా బాధిస్తోంటే రెండు స్పూన్ల కొబ్బరినూనెలో(coconut oil) చిటికెడు ఇంగువ వేసి సన్నని మంట మీద వేడిచేయాలి. ఆ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు కొన్ని చుక్కలు చెవిలో వేస్తే నొప్పి తగ్గుతుంది. అలాగే పంటి నొప్పి(toothache) వేధిస్తున్నప్పుడు చిటికెడు ఇంగువ తీసుకుని నొప్పిగా ఉన్న పన్ను మీద రాసుకోవాలి. రోజుకు రెండు నుండి మూడు సార్లు ఇలా చేస్తే పన్ను నొప్పి తగ్గిపోతుంది.

ఇంగువ జీర్ణక్రియ రేటును పెంచుతుంది. తిన్న ఆహారం పర్ఫెక్ట్ గా జీర్ణమైపోతే బరువు పెరగడమనే సమస్య ఉండదు. అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువను కలిపి త్రాగాలి. బెల్లీ ఫ్యాట్(belly fat) ను తగ్గించడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. బరువు తగ్గడంలో(weight loss) తోడ్పడుతుంది.

Face Wash: ఖరీదైన ఫేస్ వాష్ లు అక్కర్లేదు.. ఈ ఒక్కటీ ఉపయోగించి ముఖం కడుక్కుంటే చందమామలా మారడం ఖాయం..


Updated Date - 2023-05-21T20:14:44+05:30 IST