Share News

Karnataka: టీచర్‌తో విద్యార్థి ఫొటోషూట్.. మండిపడుతున్న నెటిజన్లు

ABN , Publish Date - Dec 29 , 2023 | 02:45 PM

కర్ణాటకలో జరిగిన ఓ ఫొటో షూట్(Photoshoot) ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఓ మహిళా ఉపాధ్యాయురాలు విద్యార్థితో కలిసి ఫొటో షూట్ జరుపుకోవడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Karnataka: టీచర్‌తో విద్యార్థి ఫొటోషూట్.. మండిపడుతున్న నెటిజన్లు

బెంగళూరు: కర్ణాటకలో జరిగిన ఓ ఫొటో షూట్(Photoshoot) ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఓ మహిళా ఉపాధ్యాయురాలు విద్యార్థితో కలిసి ఫొటో షూట్ జరుపుకోవడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగమల్ల చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులంతా కలిసి స్టడీ టూర్ కి వెళ్లారు.

అక్కడ అదే పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు 10వ తరగతికి చెందిన విద్యార్థి ఫొటో షూట్ చేశారు. విద్యార్థి కూడా ఆమెకు సహకరించడంతో ఇరువురు ప్రపంచాన్ని మైమరచి రెచ్చిపోయారు. వీటన్నింటి మరో వ్యక్తి ఫొటోలు తీశాడు. ఇవి కాస్తా నెట్టింట్లో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీచర్ ప్రవర్తనపై విచారణ జరిపించాలంటూ కొందరు కోరగా.. ఇద్దరినీ శిక్షించాలని మరొకరు డిమాండ్ చేశారు. కాగా వీడియోలో కనిపిస్తున్న మహిళ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 29 , 2023 | 02:48 PM