Viral Video: దెబ్బకు దారిలో పడింది.. నడిరోడ్డుపై యోగా చేసిన మోడల్.. పోలీసులు ఎలా బుద్ధి చెప్పారంటే..
ABN , First Publish Date - 2023-10-09T16:11:43+05:30 IST
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు, యూట్యూబ్ షాట్స్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీంతో అలాంటి వీడియోలు రూపొందించి ఎలాగైనా పాపులారిటీ సంపాదించాలని చాలా మంది ఊవిళ్లూరుతున్నారు. అందుకోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.
ప్రస్తుత సోషల్ మీడియా (Social Media) యుగంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు (Instagram Reels), యూట్యూబ్ షాట్స్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీంతో అలాంటి వీడియోలు రూపొందించి ఎలాగైనా పాపులారిటీ సంపాదించాలని చాలా మంది ఊవిళ్లూరుతున్నారు. అందుకోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. నడిరోడ్డు మీద రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా గుజరాత్ (Gujarat)లోని రాజ్‌కోట్‌లో ఓ మోడల్ (Model) నడిరోడ్డుపై యోగా (Yoga) చేసి వీడియో రూపొందించింది. ఆ వీడియో చూసిన పోలీసులు (Gujarat Police) ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఆ వీడియోను పోలీసులు gujaratpolice అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చిత్రీకరించారు. చిన్నగా చినుకులు పడుతున్న సమయంలో ఓ మోడల్ వాహనాలు తిరుగుతున్న రోడ్డు మీద యోగా చేసింది. 40 ఏళ్ల ఆ మహిళ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన దీనా పర్మార్. ఆమె రోడ్డు మీద యోగా చేస్తున్న సమయంలో వాహనాలు ఆగిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ మహిళ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Police: పోలీస్ ఆఫీసర్ కూడా ఇలా చేస్తారా.. పై అధికారి భార్యపై ఫిర్యాదు చేసిన పోలీస్ ఆఫీసర్ భార్య.. కారణమేంటో తెలిస్తే..
ఆ వీడియో ఆధారంగా స్పందించిన పోలీసులు దీనా పర్మార్‌ను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా తను చేసిన పని పట్ల పశ్ఛాత్తపం వ్యక్తం చేస్తున్న ఆమె వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ``నేను చేసిన పని వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఊహించలేకపోయాను. దయచేసి ఎవరూ ఇలాంటి పనులు చేయకండ``ని దీప ఆ వీడియోలో పేర్కొంది. కాగా, ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటవరకు 2 లక్షల మందికి పైగా వీక్షించారు.