Share News

Police Tweet: పోలీసులతోనే ఆటలా..? తెలివిగా షాకిచ్చారుగా.. సుఖం లేకుండా పోయిందంటూ ఓ యువతి ట్వీట్ చేయగానే..!

ABN , First Publish Date - 2023-11-01T12:39:18+05:30 IST

ఓ యువతి ట్విట్టర్ వేదికగా పోలీసులను ట్యాగ్ చేసి మరీ సుఖం అనేది లేకుండా పోయింది, దాన్ని వెతికితీసుకొచ్చివ్వండి అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన పోలీసులు తమదైన శైలిలో స్పందించారు.

Police Tweet: పోలీసులతోనే ఆటలా..? తెలివిగా షాకిచ్చారుగా.. సుఖం లేకుండా పోయిందంటూ ఓ యువతి ట్వీట్ చేయగానే..!

ఇప్పటితరం యువత వెర్రి సాధారణమైంది కాదు. కేవలం అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా ఈ విషయంలో రెండడుగులు ముందే ఉంటారు. ఓ యువతి ట్విట్టర్ వేదికగా పోలీసులను ట్యాగ్ చేసి మరీ సుఖం అనేది లేకుండా పోయింది, దాన్ని వెతికితీసుకొచ్చివ్వండి అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన పోలీసులు లైట్ తీసుకోలేదు. అలాగని ఆమెను వారు ఏమీ అనలేదు. కానీ వారి శైలి లో వారు ఆమెకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ లు చూసిన నెటిజన్లు 'పోలీసులు మంచి షాకే ఇచ్చారుగా' అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటన గురించి పూర్తీగా తెలుసుకుంటే..

వరుణ్ సందేశ్ నటించిన కొత్తబంగారు లోకం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో వరుణ్ సందేశ్ తరగతిలోని బ్లాక్ బోర్డ్ మీద 'నా హృదయం గ్రౌండ్ లో పడిపోయింది దొరికినవాళ్లు తెచ్చివ్వండి' అంటూ చాలా తుంటరిగా రాస్తాడు. ఇప్పుడు ఇదే విధంగా ఓ యువతి ట్విట్టర్ లో తుంటరి పని చేసింది. వేదిక ఆర్య అనే ఓ యువతి ట్విట్టర్(Twitter)లో 'నాకు సుఖం అనేది లేకుండా పోయింది దాన్ని వెతికి తెచ్చివ్వమని అడగడానికి నేను పోలిస్ స్టేషన్ కు వెళ్తాను' అని పోస్ట్ చేసింది. దీనికి ముంబై పోలీసుల(Mumbai Police)ను ట్యాగ్ కూడా చేసింది. యువతి పోస్ట్ ను ముంబై పోలీసులు చూడనే చూశారు. చూడగానే వారు ఊరికే ఉండలేదు. ఆ యువతికి చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. 'శ్రీమతి ఆర్య! మీకు మాపై ఉన్న నమ్మకానికి మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము. మాలో చాలామంది సుఖాన్ని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు. అయితే సుఖం మీ మనసులోనే ఉంటుందని గ్రహించగలరు. మీకు ఇంకా ఏదైనా సందేహం ఉంటే నిరభ్యరంతంగా మా వద్దకు రావచ్చు' అంటూ ఆ యువతికి ప్రత్యుత్తరం ఇచ్చారు.

Health Tips: చలికాలంలో వచ్చే సమస్యే ఇది.. అరటిపండ్లతో ఇలా చేయండి చాలు.. కాళ్లకు పగుళ్లు ఉంటే మటాష్..!



యువతి ట్వీట్, పోలీసులు స్పందించిన విధానం, వారు ఆ యువతికి చెప్పిన సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ట్విట్ లను Debangana Ghosh అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X)అకౌంట్ నుండి షేర్ చేసారు. ముంబై పోలీసుల సోషల్ మీడియా గేమ్ ఫైర్ మీద ఉంది' అంటూ క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. 'ముంబై పోలీసుల హాస్యం, వారు స్పందించే తీరు చాలా బాగుంటుంది' అని ఒకరు కామెంట్ చేశారు. 'పోలీసులు మహిళకు చాలాబాగా రిప్లే ఇచ్చారు' అని మరొకరు కామెంట్ చేశారు. చాలామంది పోలీసుల తెలివిని మెచ్చుకుంటున్నారు.

Viral News: మీరు ఈ కంపెనీలో చేరి పదేళ్లు పూర్తయిందంటూ.. యాపిల్ కంపెనీ ఇచ్చిన గిఫ్టును చూసి అంతా షాక్..!


Updated Date - 2023-11-01T12:39:18+05:30 IST