Viral Video: పోలీసన్నా.. ఇదేం శాడిజం.. రైల్వే స్టేషన్లో ప్రయాణీకులు ఆదమరచి నిద్రపోతోంటే..!
ABN , First Publish Date - 2023-07-01T15:25:31+05:30 IST
ఆపదల్లో, ఇబ్బందుల్లో ఉన్న సామాన్యులకు అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించాల్సిన విధి పోలీసులది. నేరస్థులతో కాస్త కర్కశంగా వ్యవహరించినా, సామాన్య ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాల్సిన బాధ్యత వారిది. కానీ, అహంకారంతో దురుసుగా ప్రవర్తించే పోలీసుల తీరు ఎప్పటికప్పుడు విమర్శల పాలవుతూనే ఉంది.
ఆపదల్లో, ఇబ్బందుల్లో ఉన్న సామాన్యులకు అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించాల్సిన విధి పోలీసులది. నేరస్థులతో కాస్త కర్కశంగా వ్యవహరించినా, సామాన్య ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాల్సిన బాధ్యత వారిది. కానీ, అహంకారంతో దురుసుగా ప్రవర్తించే పోలీసుల తీరు ఎప్పటికప్పుడు విమర్శల పాలవుతూనే ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ఓ కానిస్టేబుల్ (Police Constable) శాడిజాన్ని బయటపెట్టింది. ఆ వీడియోలో కానిస్టేబుల్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Rupen Chowdhury అనే ట్విటర్ యూజర్ పుణె రైల్వే స్టేషన్ (Pune railway station)లో జరిగిన ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై కొందరు ప్రయాణికులు (Passengers) ఆదమరిచి నిద్రపోతున్నారు (Sleeping on the railway platform). ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) కానిస్టేబుల్ వారిపై బాటిల్‌తో నీటి (Water)ని పోస్తున్నాడు. పాపం.. కొందరు వ్యక్తులు తుళ్లిపడి నిద్రలేచారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. పూణే డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ఇందు దుబే ఈ వీడియోపై స్పందించారు. సదరు కానిస్టేబుల్ తీరుపై విచారణ వ్యక్తం చేశారు.
Viral Video: ఆ ఏనుగు మనసు ఎంత గొప్పది.. మొసలి నుంచి జింక పిల్లను ఎలా కాపాడిందో చూడండి..
``ప్లాట్‌ఫారమ్‌పై నిద్రపోవడం ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే అలాంటి ప్రయాణికులతో ఇలా ప్రవర్తించడం మాత్రం సరైంది కాదు. ప్రయాణికులతో మర్యాదగా, హుందాగా ప్రవర్తించాలని సంబంధిత సిబ్బందికి సూచించాం. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను`` అని ఇందు ట్వీట్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. ``RIP మానవత్వం`` అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం పోలీసుల ప్రవర్తనను సమర్థిస్తున్నారు.