Python vs Cat: గూట్లో దాక్కున్న పిల్లి పిల్లలు.. తినేందుకు వెతుక్కుంటూ వచ్చిన కొండ చిలువతో తల్లి పిల్లి బిగ్ ఫైట్..!
ABN , First Publish Date - 2023-10-05T10:40:03+05:30 IST
ఈ పిల్లి తన పిల్లలను కాపాడుకునేందుకు కొండచిలువతో చేసిన ఫైట్ చూస్తే ఒళ్లు గగుర్పాటుకు లోనవుతుంది. కొన్ని క్షణాలపాటు ఆ పిల్లి కూడా పులిలా మారిపోయింది..
పిల్లి అనగానే చాలామంది పెదవి విరుస్తారు. కుక్క మొరిగినా, ఏదైనా శబ్దం అయినా చాలావరకు పిల్లులు గోడ ఎక్కడం, ఇంట్లో దాక్కోవడం చూస్తుంటారు. కానీ పిల్లిలో కోపం, పోరాట పటిమ కూడా ఉంటాయి. ఈ పిల్లి దానికి పెద్ద ఉదాహరణ. ఓ పిల్లి తన పిల్లలను కాపాడుకునేందుకు కొండచిలువతో చేసిన ఫైట్ చూస్తే ఒళ్లు గగుర్పాటుకు లోనవుతుంది. ఆకలిగొన్న కొండచిలువతో ఈ పిల్లి చేస్తున్న పోరాటానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. అంతలోనే అమ్మ అనే భాద్యతలోనే పెద్ద పోరాట పటిమ దాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..
పిల్లి(cat) ఒట్టి పిరికిదని, ప్రమాదం ఏదైనా వస్తే అది ముందుగా చేసేపని పారిపోవడమే అని అంటుంటారు. భయస్తులను గోడమీద పిల్లితో పోలుస్తుంటారు. కానీ తన పిల్లల జోలికి వస్తే పిల్లి కూడా పులిలా పోరాడుతుందని ఈ వీడియో నిరూపిస్తోంది. వీడియోలో పిల్లి తన పిల్లలతో పాటు ఒక గూట్లో ఉంది. ఆహారం కోసం వెతుకుతూ ఒక కొండచిలువ(python) అటువైపు వెళ్లింది. కొండచిలువ పిల్లిపిల్లలను పసిగట్టి ఎలాగైనా వాటిని తినేయాలని వాటిమీదకు వెళ్లబోయింది. కానీ అక్కడే ఉన్న తల్లి పిల్లి తన పిల్లలకు తాను అడ్డుగా నిలిచింది. అసలే ఆవేశంలో ఉన్న కొండచిలువ తనను ఏం చేస్తుందో అనే భయం ఏ కోశాన తల్లి పిల్లిలో కనిపించలేదు. అది చాలా రౌద్రంగా కొండచిలువతో తలపడేందుకు సిద్దమైంది. కొండచిలువ పిల్లిపిల్లల మీదకు వెళ్లబోతుంటే తన పంజాతో కొండచిలువకు ఒక్క షాట్ ఇచ్చింది(mother cat fight with python). ఆ తరువాత కొండచిలువ మరింత విజృంభిస్తోంటే తల్లిపిల్లి తన నోటితో కొండచిలువను కొరుకుతుంది. అదే సమయంలో పిల్లి పిల్లలు అక్కడి నుండి పారిపోతాయి. ఇక్కడితో వీడియో ఆగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు.
Vomit Sensation While Journey: ప్రయాణాల్లో ఉండగా అసలు వాంతులు ఎందుకొస్తాయి..? చిన్న పిల్లలకు ఈ సమస్య రాకుండా ఉండాలంటే..!
ఈ వీడియోను @Rainmaker1973 అనే ట్విట్టర్ ఎక్స్ యూజర్ అక్టోబర్ 3వ తేదీన షేర్ చేశారు. కొండచిలువ మీద పిల్లి దాడిచేసిన వేగం గురించి క్యాప్షన్ లో ప్రస్తావించారు. ఈ వీడియోను ఇప్పటిదాకా 36లక్షలమంది వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లి ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు. తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించినది ఏదీ లేదు' అని ఒకరు కామెంట్ చేశారు.'తన పిల్లల జోలికి వస్తే పిల్లి కూడా పులి అయిపోయింది'అని మరొకరు కామెంట్ చేశారు. 'ఆ కొండచిలువ చాలా భయానకంగా ఉంది, అలాంటి దాన్ని చూసి కూడా ఆ పిల్లి చూపించిన తెగువ అద్భుతం' అని ఇంకొకరు అన్నారు.