Rameswaram: రామేశ్వరం కోటి తీర్థ ప్రసాదం ‘డోర్ డెలివరీ’
ABN , First Publish Date - 2023-05-30T11:00:22+05:30 IST
రామేశ్వరం రామనాథస్వామి ఆలయ(Ramanathaswamy Temple) కోటి తీర్థం, ప్రసాదం ‘డోర్ డెలివరీ’ సేవలను తపాలా శాఖ పరిచయం చేసిం
ఐసిఎఫ్(చెన్నై): రామేశ్వరం రామనాథస్వామి ఆలయ(Ramanathaswamy Temple) కోటి తీర్థం, ప్రసాదం ‘డోర్ డెలివరీ’ సేవలను తపాలా శాఖ పరిచయం చేసింది. ఈ ఆలయంలో ఉన్న 22 తీర్థాల్లో స్నానం చేస్తే పాప నివృత్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. వాటిలో 22వ తీర్థం అన్ని తీర్థాల్లోకన్నా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ తీర్థాన్ని కొంతమంది ఆన్‌లైన్‌లో అదనపు ధరకు విక్రయిస్తున్నారు. అక్రమ విక్రయాలను అడ్డుకొనేలా చర్యలు చేపట్టిన దేవాదాయ శాఖ, తపాలా శాఖతో కలసి 100 మి.లీ తీర్థం, 100 గ్రాముల కలకండ, రామనాథస్వామి, పర్వతవర్ధిని అమ్మవారి ఫొటోలు, విభూది, కుంకుమతో కూడిన ప్రసాద ప్యాకెట్లు 200 కి.మీ దూరంలో ఉన్న వారికి రూ.205, 1000 కి.మీ దూరానికి రూ.215, అంతకు మించి ఉంటే రూ.235కు డోర్ డెలివరీ చేయనుంది. ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించిన వారికి మాత్రమే ప్రసాదం పంపించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.