New research by scientists: కాలు పోతే కొత్త కాలు... చెయ్యి పోతే కొత్త చెయ్యి మొలిపిస్తారట... విజయవంతమవుతున్న శాస్త్రవేత్తల ప్రయత్నాలు!

ABN , First Publish Date - 2023-03-20T11:24:22+05:30 IST

New research by scientists: మనిషి శరీరంలో తెగిపోయిన కాళ్లు(Severed legs), చేతులను తిరిగి మొలిపించేందుకు శాస్త్రవేత్తలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

New research by scientists: కాలు పోతే కొత్త కాలు... చెయ్యి పోతే కొత్త చెయ్యి మొలిపిస్తారట... విజయవంతమవుతున్న శాస్త్రవేత్తల ప్రయత్నాలు!

New research by scientists: మనిషి శరీరంలో తెగిపోయిన కాళ్లు(Severed legs), చేతులను తిరిగి మొలిపించేందుకు శాస్త్రవేత్తలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. చేతులు, కాళ్లలో పెరిగే కణాలను(cells) ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. జింక(deer) శరీరంలో దాని కొమ్ములను పునరుత్పత్తి చేసేందుకు బ్లాస్టెమా కణాలు(Blastema cells) ఉపకరిస్తాయి. ఈ కణాలను శాస్త్రవేత్తలు(Scientists) మనిషి ప్రయోజనం కోసం ఉపయోగించాలనుకుంటున్నారు.

సైన్స్ జర్నల్‌(Science Journal)లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని చైనాలోని జియాన్‌లో గల నార్త్‌వెస్ట్రన్ పాలిటెక్నికల్ యూనివర్సిటీ (Northwestern Polytechnic University)శాస్త్రవేత్తలు నిర్వహించారు. దీనిలో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. జింక శరీరంలో లభించిన బ్లాస్టెమా ప్రొజెనిటర్ కణాలను శాస్త్రవేత్తలు ఎలుక తలలోకి చొప్పించినప్పుడు, 45 రోజుల తర్వాత దాని తలపై కొమ్ము(horn) లాంటి ఆకారం ఉద్భవించింది. ఈ నమూనాతో మానవ అవయవాలను తిరిగి అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు.

పరిశోధకుల(researchers) అభిప్రాయం ప్రకారం, బ్లాస్టెమా కణాలను మానవ శరీరం(human body)లోకి ప్రవేశపెట్టినప్పుడు అవి ఎముకలు, మృదులాస్థులను తిరిగి పెంచే అవకాశం ఉంది. ఇదేవిధంగా అనేక క్షీరద జీవులలో స్వీయ-పునరుద్ధరణ కణాలు కనిపిస్తాయి. ఎలుకలు కూడా ఈ రకమైన కణాలను కలిగి ఉంటాయి, అయితే ఈ కణాలను ఉపయోగించే జంతువు జింక మాత్రమే అని తేలింది. జింక కొమ్ములు విరిగిపోయినప్పుడు బ్లాస్టెమా కణాలు(Blastema cells) వెంటనే చురుగ్గా పనిచేస్తాయని అధ్యయనంలో తేలింది. కొమ్ము పూర్తిగా పడిపోయిన తర్వాత, కొత్త కొమ్ము ఉద్భవిస్తుంది.

Updated Date - 2023-03-20T11:36:35+05:30 IST