Viral Video: బాహుబలి పుట్టాడా ఏంటీ..? తల్లి కడుపులోంచి బయటకొచ్చిన గంటలోనే ఎంత బరువును లేపాడో చూడండి..!

ABN , First Publish Date - 2023-08-30T16:33:40+05:30 IST

అప్పుడే పుట్టిన శిశువు చాలా బలహీనంగా ఉంటాడు. శారీరక బలం ఉండదు. అసలు ఏదైనా వస్తువును పట్టుకోవడమే కష్టం. అలాంటిది ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మనం అనుకుంటున్నది తప్పు అని రుజువు అవుతుంది. అప్పుడే పుట్టిన ఓ శిశువు రెండు చేతులతో ట్రే పట్టుకుని పైకి లేపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Viral Video: బాహుబలి పుట్టాడా ఏంటీ..? తల్లి కడుపులోంచి బయటకొచ్చిన గంటలోనే ఎంత బరువును లేపాడో చూడండి..!

అప్పుడే పుట్టిన శిశువు (New Born Baby) చాలా బలహీనంగా ఉంటాడు. శారీరక బలం ఉండదు. అసలు ఏదైనా వస్తువును పట్టుకోవడమే కష్టం. అలాంటిది ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మనం అనుకుంటున్నది తప్పు అని రుజువు అవుతుంది. అప్పుడే పుట్టిన ఓ శిశువు రెండు చేతులతో ట్రే పట్టుకుని పైకి లేపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది (New Born Baby lifts tray). అక్కడే ఉన్న నర్సు, ఆస్పత్రి సిబ్బంది ఆ శిశువుని చూసి ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. అయితే శిశువు పట్ల నర్సు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

@bhakttrilokika అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక నర్సు అప్పుడే పుట్టిన శిశువును తలక్రిందులుగా పట్టుకుంది. అయితే ఆ శిశువు కింద ఉన్న ట్రేను రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. నర్సు (Nurse) ఆ శిశువును పైకి లేపినపుడు ఆ ట్రే కూడా పైకి లేచింది. ఆ శిశువు బలాన్ని చూసి ఆ నర్సు, అక్కడే ఉన్న ఆస్పత్రి సిబ్బంది షాక్ అయిపోయారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ``5G లాంఛ్ బాయ్`` అని కామెంట్ చేశారు.

Indian Railways: భారతీయ రైల్వేకు అసలు ఆదాయం ఎలా వస్తుంది..? టికెట్ల రూపంలో వచ్చేది కొంతే కానీ..!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 5.6 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 11 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అలాగే అప్పుడే పుట్టిన శిశువుతో ఆ నర్సు ప్రవర్తించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``నిజంగా ఈ పిల్లాడు శక్తిమాన్ అయి ఉండాలి``, ``చంద్రయాన్ చంద్రునిపైకి చేరిన వెంటనే భారతదేశంలో నిజమైన బాహుబలి పుట్టాడు``, ``ఆ నర్సును వెంటనే జైలుకి పంపండి. ఇది అమానవీయం`` అని కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-30T16:36:04+05:30 IST