Resignation Letter: మూడే మూడు పదాల్లో రిజైన్ లెటర్‌ను ఇచ్చేశాడో ఉద్యోగి.. అసలు ఆ రాజీనామా లేఖలో ఏం రాశాడో చూస్తే..!
ABN , First Publish Date - 2023-06-16T09:43:14+05:30 IST
ఉద్యోగం కోసం అప్లికేషన్ ఎలాగైతే ఇస్తుంటామో, ఉద్యోగం మానేసేటప్పుడు రిజైన్ లెటర్ అలాగే ఇస్తుంటాం. రిజైన్ లెటర్ లో సాధారణంగా ఉద్యోగం మానేయడానికి గల కారణాలు వివరించడమే కాకుండా అప్పటి వరకు పనిచేసిన సంస్థ గురించి పొగుడుతూ ఓ నాలుగు వాక్యాలు రాస్తుంటారు. అయితే ఓ ఉద్యోగి మాత్రం విభిన్నంగా ఆలోచించాడు. కేవలం మూడే మూడు పదాలతో రాజీనామా లెటర్ ను యాజమాన్యానికి అందించాడు.
ఉద్యోగం కోసం అప్లికేషన్ ఎలాగైతే ఇస్తుంటామో, ఉద్యోగం మానేసేటప్పుడు రిజైన్ లెటర్ అలాగే ఇస్తుంటాం. రిజైన్ లెటర్ లో సాధారణంగా ఉద్యోగం మానేయడానికి గల కారణాలు వివరించడమే కాకుండా అప్పటి వరకు పనిచేసిన సంస్థ గురించి పొగుడుతూ ఓ నాలుగు వాక్యాలు రాస్తుంటారు. అయితే ఓ ఉద్యోగి మాత్రం విభిన్నంగా ఆలోచించాడు. కేవలం మూడే మూడు పదాలతో రాజీనామా లెటర్ ను యాజమాన్యానికి అందించాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు 'ఇదేదో బాగుందే.. మేమూ ఇలానే ఫాలో అవుతాం' అంటున్నారు. ఇంతకూ సదరు ఉద్యోగి ఇచ్చిన రాజీనామా లెటర్ లో ఏముుంది? నెటిజన్లు కూడాఎందుకంత ఇంప్రెస్ అయ్యారు? పూర్తీగా తెలుసుకుంటే..
ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోవడం(job application), లీవ్ లెటర్స్ రాయడం(leave letters), లవ్ లెటర్స్(love letters) రాయడం ఇలాంటి రాతపూర్వక విషయాల్లో కొందరికి స్పెషల్ స్కిల్స్(special skills in writing) ఉంటాయి. అలా రాసినవి చూడగానే ఇతరులు ఇంప్రెస్ అవుతుంటారు. ఓ వ్యక్తి తన ఉద్యోగానికి సమర్పించిన రాజీనామా ఉత్తరం(resign letter) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా పనిచేసిన సంస్థ గురించి, తోటి ఉద్యోగుల సహకారం, సంస్థ నుండి నేర్చుకున్న విషయాలు రాజీనామా ఉత్తరంలో రాస్తారు. ఆ తరువాత ఎందుకు రిజైన్ చేయాలని అనుకుంటున్నారనే విషయాన్ని రిజైన్ లెటర్ లో పొందుపరుస్తుంటారు. కానీ ఇతను మాత్రం అందుకు పూర్తీ విరుద్దం. డియర్ సర్(Dear Sir) అని సంభోదించి, రిసిగ్నేషన్ లెటర్(RESIGNATION LETTER) అని మెన్షన్ చేసి తీరా సారాంశం రాయాల్సిన చోట బై బై సర్(Bye bye sir) అని మూడు ముక్కల్లో తను వెళ్ళిపోతున్నట్టు తెలియజేశాడు.
Viral Video: ఈ కుర్రాడి వింత చేష్టలకు ఉలిక్కి పడిన యువతి.. పక్కనున్న ట్రెడ్‌మిల్‌పైకి సైలెంట్‌గా వచ్చి.. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే..!
ఈ రాజీనామా లెటర్ ను Maphanga Mbusoఅనే ట్విట్టర్ అకౌంట్(Twitter account) నుండి షేర్ చేశారు. Simple (సింపుల్) అనే క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ వెర్రెత్తిపోతున్నారు. 'ఇతనెవరో బిందాస్ ఎంప్లాయీ లాగున్నాడు, అందుకే అంత సింపుల్ గా రిజైన్ లెటర్ ఇచ్చాడు' అని అంటున్నారు. 'ఇకమీదట మేము ఇలానే రిజైన్ లెటర్ ఇస్తాం' అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'సూటిగా సుత్తిలేకుండా చెప్పడమంటే ఇదే కదా..' అని ఇంకొందరు అంటున్నారు.
Butter Milk: ఏంటీ..? మజ్జిగతో జుట్టును జిగేల్‌మనిపించొచొచ్చా..? అని అవాక్కవుతున్నారా..? ఓ గ్లాసుడు మజ్జిగలో దీన్ని కలిపి..!