Viral Video: కాలం కలిసి రాక ఇలా అయిపోయాడు కానీ.. లేకుంటే సెలబ్రెటీ అయేవాడేమో.. ఈయన టాలెంట్‌ ఏంటో చూస్తే..!

ABN , First Publish Date - 2023-07-04T13:08:10+05:30 IST

సాధువులు, సన్యాసుల జీవితాలు చాలా నిరాడంబరంగా ఉంటాయి. ఎల్లప్పుడూ భజనలు చేస్తూ, దేవుడిని స్థుతిస్తూ కాలం గడుపుతారు. వారి ఆహారం, దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉంటాయి. అలాంటి ఓ సాధువు తన అద్భుత ట్యాలెంట్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

Viral Video: కాలం కలిసి రాక ఇలా అయిపోయాడు కానీ.. లేకుంటే సెలబ్రెటీ అయేవాడేమో.. ఈయన టాలెంట్‌ ఏంటో చూస్తే..!

సాధువులు, సన్యాసుల జీవితాలు చాలా నిరాడంబరంగా ఉంటాయి. ఎల్లప్పుడూ భజనలు చేస్తూ, దేవుడిని స్థుతిస్తూ కాలం గడుపుతారు. వారి ఆహారం, దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉంటాయి. అలాంటి ఓ సాధువు (Saint)తన అద్భుత ట్యాలెంట్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. భజనలు, కీర్తనలు మాత్రమే కాదు.. ర్యాప్ సాంగ్స్ (Rap song) కూడా అద్భుతంగా పాడేస్తున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి ట్యాలెంట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు (Sadhu sang rap).

Ashish Bhagat అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ సాధువు అత్యద్భుతంగా ర్యాప్ సాంగ్ పాడేస్తున్నాడు. పాడుతున్నప్పుడు అతడి హావభావాలు, స్టైల్ చూస్తుంటే ఓ ప్రొఫెషనల్ ర్యాపర్ పాడినట్టే అనిపిస్తోంది. నిజమైన ర్యాపర్లు కూడా ఈ సాధువులా ఒక్క టేక్‌లో పాడలేరేమో. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: స్నేహితుడి కోసం ఆ కుక్క ఎలా విలవిలలాడిందో.. సహాయం చేయమని ఎలా అడుగుతోందో చూడండి..

``ఈ సాధువు బొహేమియా ఖలీఫా``, ``అతడు సాధువు కాకుండా ఉండుంటే.. కచ్చితంగా ఫేమస్ ర్యాప్ సింగర్ అయ్యేవాడు``, ``నిజమైన ర్యాపర్లు కూడా అడిగిన వెంటనే ఇలా పాడలేరు``, ``అద్భుతమైన ట్యాలెంట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-04T13:08:10+05:30 IST