Viral Video: వార్నీ.. ఆ వయసులోనే అమ్మాయి కోసం ఫైటింగా? సినిమా తరహాలో కొట్టుకున్న ఇద్దరు విద్యార్థులు!
ABN , First Publish Date - 2023-10-09T20:23:36+05:30 IST
స్కూళ్లలోనూ, కాలేజీల్లోనూ విద్యార్థుల మధ్య గొడవలు సర్వ సాధారణమే. ఏదో విషయమై గొడవ పడి ఒకరినొకరు కొట్టుకోవడం అప్పుడప్పుడు చూస్తుంటాం. ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల మధ్య అమ్మాయిల విషయమై గొడవలు జరుగుతుంటాయి. బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా విడిపోయి కూడా కొట్టుకుంటారు.
స్కూళ్లలోనూ, కాలేజీల్లోనూ విద్యార్థుల (Students) మధ్య గొడవలు సర్వ సాధారణమే. ఏదో విషయమై గొడవ (Fighting) పడి ఒకరినొకరు కొట్టుకోవడం అప్పుడప్పుడు చూస్తుంటాం. ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల మధ్య అమ్మాయిల విషయమై గొడవలు జరుగుతుంటాయి. బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా విడిపోయి కూడా కొట్టుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral Video)లో ఇద్దరు స్కూల్ బాయ్స్ (School boys fighting) కొట్టుకుంటున్నారు. ఓ అమ్మాయి కోసం వారిద్దరూ భారీ ఫైటింగ్‌కు దిగడం చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది.
@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో స్కూల్ యూనిఫామ్ వేసుకున్న కొందరు విద్యార్థులు గుంపుగా ఉన్నారు. అంతలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ మొదలైంది. వారిద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఒకరిద్దరు అబ్బాయిలు వారి మధ్యలోకి వెళ్లి విడిపించేందుకు ప్రయత్నించారు. అయినా వారు శాంతించలేదు. ఓ అమ్మాయి (Girl) కోసం వారు గొడవ పడుతున్నట్టు తెలుస్తోంది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Viral Video: ఇదెక్కడి సరదా బ్రదర్.. కదులుతున్న లారీలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఇప్పటివరకు 45 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``భారత్‌లోని విద్యా సంస్థల్లో ఇలాంటి గొడవలు సాధారణమే``, ``ఆ వయసులోనే అమ్మాయి కోసం గొడవా``, ``సినిమాలు చిన్న వయసులోనే చెడగొడుతున్నాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.