Viral Video: వామ్మో.. మరీ ఇంత డేంజరా..? అలల దెబ్బకు సముద్రం అంచున కట్టిన హోటల్ పరిస్థితి ఏమైందో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-07-03T17:01:21+05:30 IST
ప్రకృతి శక్తులైన గాలి, నీరు ముందు ఏవీ నిలువలేవు. అవి ఉగ్రరూపం దాలిస్తే ఎంతటి కట్టడమైనా గజగజ వణకాల్సిందే. ముఖ్యంగా నీటి శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే కాస్త ఆందోళనకు, భయానికి గురవక తప్పదు.
ప్రకృతి శక్తులైన గాలి (Air), నీరు (Water) ముందు ఏవీ నిలువలేవు. అవి ఉగ్రరూపం దాలిస్తే ఎంతటి కట్టడమైనా గజగజ వణకాల్సిందే. ముఖ్యంగా నీటి శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో (Shocking Video) చూస్తే కాస్త ఆందోళనకు, భయానికి గురవక తప్పదు. ప్రకృతితో ఆడుకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందనే సందేశాన్ని ఈ వీడియో అందిస్తోంది. ship_spotting_greece అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.
స్పెయిన్ (Spain)లోని కానరీ ద్వీపంలో ఈ వీడియోను చిత్రీకరించినట్టు సమాచారం. వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. బీచ్ ఒడ్డున, సముద్రాని (Sea)కి అతి దగ్గర్లో ఓ భారీ భవనాన్ని (Building) నిర్మించారు. అయితే ఆ సుందర భవనం సముద్రపు అలల (Sea Waves) తాకిడికి అతలాకుతలమవుతోంది. ఓ భారీ అలకు ఆ భవనం బాల్కనీ (Balcony) సర్వనాశనం అయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ మనుషులెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే సముద్రానికి అంత దగ్గరగా భవనం నిర్మించడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.
Viral Video: బ్రేస్‌లెట్ ఆర్డర్ ఇచ్చిన యువతికి దిమ్మతిరిగిపోయే షాక్.. డెలివరీ బాయ్ ఇచ్చిన పార్శిల్‌లో డబ్బా.. ఓపెన్ చేసి చూస్తే..!
ఆ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 41 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఎంతో మంది ఆ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``సముద్రానికి అంత దగ్గరగా బిల్డింగ్ కట్టడం అవివేకం, అసలు పర్మిషన్ ఎవరిచ్చారు``, ``సముద్ర తీరంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నప్పుడు బిల్డర్ ఏమనుకుని ఉంటాడో``, ``ఆ హోటల్‌లో ఉండాలనుకునేవారు తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టుకోవడమే``, ``సముద్రంతో ఆడుకోవడం చాలా ప్రమాదకరం`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.