Shocking Video: మామిడి పళ్ల కోసం సిగపట్లు.. లండన్ వీధుల్లో కొట్టుకున్న పాకిస్థానీయులు.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-06-25T15:44:24+05:30 IST

ఏదైనా ఓ వస్తువు కోసం గొడవ పడడం, కొట్టుకోవడం వంటి సాధారణంగా మన బజార్లలో, మార్కెట్లలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఉన్నత చదువులు చదివి, విదేశాలకు వెళ్లినా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు.

Shocking Video: మామిడి పళ్ల కోసం సిగపట్లు.. లండన్ వీధుల్లో కొట్టుకున్న పాకిస్థానీయులు.. వీడియో వైరల్!

ఏదైనా ఓ వస్తువు కోసం గొడవ పడడం, కొట్టుకోవడం వంటి సాధారణంగా మన బజార్లలో, మార్కెట్లలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఉన్నత చదువులు చదివి, విదేశాలకు వెళ్లినా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. విదేశాల్లో నివసిస్తున్న కొందరు ఆసియన్లు వెకిలిగా ప్రవర్తిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తమ దేశం పరువు తీస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video) మామిడి పళ్ల (Mangoes) కోసం లండన్‌ (London)లోని ఓ షాప్‌లో గొడవ జరిగింది.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్నది పాకిస్థానీయులని (Pakistani People) తేలింది. ఈ వీడియోలో కొందరు మామిడి పళ్లు చేజిక్కించుకునే ప్రయత్నంలో ఒకరిపై మరొకరు దాడికి దిగారు (Fight for mangoes in London). చేతికి అందిన వస్తువులతో కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఓ మహిళ కూడా రంగంలోకి దిగింది. అవతలి వ్యక్తిని అమాంతం తోసి పడేసింది. ఈ ఘటనలో కొందరు జారి పడ్డారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

Viral Video: వరుడికి అంత అహంకారమా? ఎంగిలి స్వీట్‌ను వధువు చేత బలవంతంగా ఎలా తినిపించాడో చూడండి..

@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``డబ్బు ఉంటే నువ్వు డిగ్రీ కొనుక్కోవచ్చు. కానీ, విజ్ఞానం, సంస్కారం మాత్రం కొనలేవు``, ``నాకు ఈ ఫైట్ బాగా నచ్చింది.. క్షమించండి``, ``ఇది జంతు ప్రవర్తన. మాటలతో చెప్పలేనపుడు ఇలాంటి ప్రవర్తన బయటపడుతుంది`` అని కామెంట్లు చేశారు.

Updated Date - 2023-06-25T15:44:24+05:30 IST