Shocking Video: షాపింగ్ మాల్స్‌లోనూ, రైల్వే స్టేషన్లలోనూ ఎస్కలేటర్‌నే వాడుతుంటారా..? ఇలాంటి ఘోరాలు కూడా జరుగుతుంటాయ్ జాగ్రత్త..!
ABN , First Publish Date - 2023-05-04T14:07:00+05:30 IST
షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్స్ (Metro Stations), హాస్పిటల్స్ ఇలా చాలాచోట్ల ప్రస్తుతం మనకు అధికంగా ఎస్కలేటర్లు దర్శనమిస్తున్నాయి.
![Shocking Video: షాపింగ్ మాల్స్‌లోనూ, రైల్వే స్టేషన్లలోనూ ఎస్కలేటర్‌నే వాడుతుంటారా..? ఇలాంటి ఘోరాలు కూడా జరుగుతుంటాయ్ జాగ్రత్త..!](https://media.andhrajyothy.com/media/2023/20230426/Esc_4bd842e941.jpg)
Escalator Video Viral: షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్స్ (Metro Stations), హాస్పిటల్స్ ఇలా చాలాచోట్ల ప్రస్తుతం మనకు అధికంగా ఎస్కలేటర్లు దర్శనమిస్తున్నాయి. కింది ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్‌కి వెళ్లడం గానీ, పై ఫ్లోర్ నుంచి కిందికి దిగడం గానీ వీటి ద్వారా చాలా సులువుగా అయిపోతుంటుంది. దాంతో జనాలు ఎస్కలేటర్ కనిపిస్తే చాలు.. ఎంచక్కా ఎక్కేస్తుంటారు. అయితే, సోషల్ మీడియాలో (Social Media) ఓ మెట్రో స్టేషన్‌లో సంభవించిన ఎస్కలేటర్ ప్రమాదం తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మీరూ షాపింగ్ మాల్స్‌లోనూ, రైల్వే స్టేషన్లలోనూ ఎస్కలేటర్‌నే (Escalator) వాడుతుంటే మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా జాగ్రత్త పడాల్సిందే.
ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ప్రకారం ఈ ఘటన టర్కీ (Turkey) రాజధాని ఇస్తాంబుల్‌లోని అయాజ్గా మెట్రో స్టేషన్ (Ayazga metro station) జరిగినదిగా తెలుస్తుంది. మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఎస్కలేటర్ ప్రమాదం తాలూకు దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ప్రయాణికులు ఎస్కలేటర్ ఎక్కే క్రమంలో ఒక్కసారిగా అది రెండు విడిపోవడం మనం వీడియోలో చూడొచ్చు. దాంతో ఓ ప్రయాణికులు అందులో ఇరుక్కుపోవడం కూడా వీడియోలో ఉంది. ఆ తర్వాత కొంతసేపటికే అది ఆగిపోయింది. అంతే.. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలేం జరుగుతుందో కూడా వారికి అర్థం కాలేదు. ఇప్పుడీ ఘటన తాలూకు వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు వామ్మో.. ఎస్కలేటర్‌తో ఇంత ప్రమాదమా? అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం మీరు ఈ షాకింగ్ ఘటనపై ఓ లుక్కేయండి.
Viral Video: ఈ అమ్మాయ్ మరీ ఇంత వైల్డ్‌గా ఉందేంటి..? డోర్ వద్ద కుర్రాళ్లతో కిక్కిరిసిపోయి బస్సులోకి వెళ్లడానికి దారే లేదని..