Viral Video: ఇంకెప్పుడూ అమ్మాయిల జోలికి వెళ్లడు.. నడిరోడ్డు మీద పోకిరీని చితక్కొట్టిన అక్కాచెల్లెళ్లు.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-06-25T16:30:19+05:30 IST

కేవలం అమ్మాయిలే కదా ఏడిపిద్దాం అనుకున్నాడు. కాలేజీకి వెళ్లేటపుడు, వచ్చేటపుడు వేధించేవాడు. ఎవరికీ చెప్పుకోలేరులే అనే ధైర్యంతో అసభ్యంగా మాట్లాడేవాడు. చిన్న అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టుకుని, శారీరకంగా వేధించాడు. దీంతో ఆ అమ్మాయిల్లో సహనం నశించింది. నడిరోడ్డు మీద ఆ పోకిరీ పని పట్టారు.

Viral Video: ఇంకెప్పుడూ అమ్మాయిల జోలికి వెళ్లడు.. నడిరోడ్డు మీద పోకిరీని చితక్కొట్టిన అక్కాచెల్లెళ్లు.. వీడియో వైరల్!

కేవలం అమ్మాయిలే కదా ఏడిపిద్దాం అనుకున్నాడు. కాలేజీకి వెళ్లేటపుడు, వచ్చేటపుడు వేధించేవాడు (Harassment). ఎవరికీ చెప్పుకోలేరులే అనే ధైర్యంతో అసభ్యంగా మాట్లాడేవాడు. చిన్న అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టుకుని, శారీరకంగా వేధించాడు. దీంతో ఆ అమ్మాయిల్లో సహనం నశించింది. నడిరోడ్డు మీద ఆ పోకిరీ (Stalker) పని పట్టారు. రోడ్డు మీద పడేసి చితక్కొట్టారు. కాళ్లతో తన్నేశారు. ఆ అమ్మాయిల ఎదురు తిరగడంతో ఆ యువకుడు సిగ్గుతో చచ్చిపోయాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో ఈ ఘటన జరిగింది. 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికను విజయ్ సర్కాటే అనే యువకుడు కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. ప్రేమ పేరుతో వెంబడిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆ బాలికకు గిఫ్ట్ ఇవ్వబోయాడు. ఆ గిఫ్ట్‌ను ఆ బాలిక తిరస్కరించింది. అయినా విజయ్ వెనక్కి తగ్గకుండా ఆ గిఫ్ట్‌ను బలవంతంగా బాలిక బ్యాగ్‌లో పెట్టాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ విషయాన్ని ఆ బాలిక తన 19 ఏళ్ల అక్కకు చెప్పింది. ఇద్దరూ రోడ్డు మీద వెళ్తుండగా విజయ్ వారిని వెంబడించాడు.

Shocking Video: మామిడి పళ్ల కోసం సిగపట్లు.. లండన్ వీధుల్లో కొట్టుకున్న పాకిస్థానీయులు.. వీడియో వైరల్!

అతడికి రోడ్డు మీదే బుద్ధి చెప్పాలని అక్కాచెల్లెళ్లు నిర్ణయించుకున్నారు. అతడిని పట్టుకుని కొట్టారు (Sisters thrashed Stalker). అతడు రోడ్డు మీద పడిపోయినా వారు వదల్లేదు. కాళ్లతో తన్నారు. ఆ ఘటనను రోడ్డు మీద ఉన్న వారు వీడియో తీయడానికి ప్రయత్నించారు. దాంతో విజయ్ తన మొహం కనబడకుండా కవర్ చేసుకోవడానికి ప్రయత్నించారు. బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-06-25T16:30:19+05:30 IST