Skin Health: రోజూ ఇవి కొద్దిగా తింటే చాలు.. ముసలివాళ్ళు కూడా యవ్వనంగా మారతారు..
ABN , First Publish Date - 2023-03-24T14:22:11+05:30 IST
ఇదొక్కటి రోజూ తింటే మ్యాజిక్ చేస్తుంది.. ముసలిగా ఉన్నవారు కూడా యవ్వనంగా మారతారు..
వయసు పెరిగేకొద్ది చర్మం ముడుతలు పడటం సహజం. కానీ ముడుతలు పడిన చర్మంతో కనిపించాలని ఎవరూ అనుకోరు.మరీ ముఖ్యంగా చిన్నవయసులోనే చర్మం ముడుతలు పడినవారు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు ఎక్కువగా మార్కెట్ లో దొరికే క్రీములు, సీరమ్ లు, ప్యాక్ లు కొని తమ చర్మాన్ని యవ్వనంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే చర్మానికి శరీరం లోపలి నుండి పోషణ కావాలి. అప్పుడే చర్మంలో వృద్దాప్య ఛాయలు తొలగి యవ్వనంగా మారుతుంది. యాంటీ ఏజింగ్(Anti-Aging) లక్షణాలు ఉన్న చాలా రకాల పండ్లు, కూరగాయలు(Fruits, Vegetables) ఇందుకోసం తీసుకుంటారని అందరికీ తెలుసు. కానీ వాటికంటే ప్రభావవంతంగా తొందరగా శరీరం మీద ముడుతలను(Wrinkles) తగ్గించి మ్యాజిక్ చేసే పదార్థం ఉంది. అదేమిటో.. అదెలా సహాయపడుతుందో తెలుసుకుంటే..
తెలుగు ప్రజలకు చాలా తక్కువగా తెలిసిన పదార్థం ఫూల్ మఖానా(Phool Makhana).. వీటినే లోటస్ సీడ్(Lotus Seed) అని కూడా అంటారు. ఈ ఫూల్ మఖానా ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో విస్తారంగా ఉత్పత్తి చేస్తారు(Phool Makhana Produced in Bihar State). ఫూల్ మఖానా శరీరానికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినా ముఖ్యంగా శరీరం మీద ముడుతలు తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఇవి తింటూ ఉంటే అరవై లోనూ ఇరవైలా కనబడతారు.
ఫూల్ మఖానా లో చాలా ఔషద గుణాలు ఉన్నాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంట్(Anti accident), యాంటీ ఇన్ఫ్లమేటరీ(anti inflammatory), యాంటీ ట్యూమర్(anti tumor) లక్షణాలను కలిగి ఉంటుంది. వీటిలో కాల్షియం(Calcium), మెగ్నీషియం(Magnesium), ప్రోటీన్లు(Proteins) అధికమొత్తంలో ఉంటాయి. కేలరీలు తక్కువగా(Low calories) ఉండటం వల్ల లావు అవుతామేమో అనే బెంగ అక్కర్లేదు.
ఫూల్ మఖానా తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా(rich fiber content) ఉంటుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే ఇందులో ఉండే ఐరన్(Iron), ఫాస్పరస్(Phosphorus) గుణాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. నరాల పనితీరు(Nerve system), కండరాల పనితీరు మెరుగ్గా ఉంచుతాయి. క్యాన్సర్(Cancer), మధుమేహం(diabetes), గుండె జబ్బులను(Heart problems) దరిచేరనీయదు.
ముఖ్యంగా కొల్లాజన్(Collagen) ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మం హైడ్రేట్ గా ఉండేలా చేస్తుంది. దీనివల్ల శరీరం మీది ముడుతలు తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా ఉంటుంది.
ఫూల్ మఖానాతో కూరలు తయారు చేయవచ్చు, పాయసం చేసుకోవచ్చు, ఇవన్నీ కుదరకపోతే వీటిని వేయించుకుని కాస్త ఉప్పు, కారం చల్లుకుని సాయంత్రం పూట స్నాక్ గా కూడా తినచ్చు. ఎలా తీసుకున్నా ఇది అద్బుతమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది.