Shocking: ఇది అందమైన ప్రకృతి దృశ్యం కాదు.. ప్రపంచం అంతమైపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!
ABN , First Publish Date - 2023-10-22T15:18:09+05:30 IST
ప్రకృతి ఎన్నో వింతలు, విచిత్రాలతో నిండి ఉంటుంది. ఈ ప్రకృతి రహస్యాల గురించి మనకు తెలిసింది చాలా కొద్ది వరకు మాత్రమే. ఎప్పటికప్పుడు ప్రకృతి విశేషాలు మనుషులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అలాంటి ఎన్నో స్పెషల్ వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రకృతి (Nature) ఎన్నో వింతలు, విచిత్రాలతో నిండి ఉంటుంది. ఈ ప్రకృతి రహస్యాల గురించి మనకు తెలిసింది చాలా కొద్ది వరకు మాత్రమే. ఎప్పటికప్పుడు ప్రకృతి విశేషాలు (Nature Wonders) మనుషులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అలాంటి ఎన్నో స్పెషల్ వీడియోలు (Viral Video) ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఫొటోలు చూస్తే షాక్ కాక తప్పదు. బ్రిటన్ (Britain)లోని ఓ ప్రాంతంలో ఆకాశం (Pink Sky) చాలా భయంకరంగా కనిపించింది.
బ్రిటన్‌లో ఆకాశం రంగును చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆకాశం అకస్మాత్తుగా గులాబీ రంగులో ఉన్న అనేక ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ (Viral) అవుతున్నాయి. కెంట్ (Kent)లోని థానెట్ ప్రాంతంలో ఆకాశం మొత్తం గులాబీ రంగులోకి మారిపోయింది. ఈ సంఘటన అక్టోబర్ 19న జరిగినట్టు తెలుస్తోంది. ఈ వింతను స్థానిక ప్రజలు కెమెరాల్లో బంధించారు. కాగా, ఆకాశంలో రంగులు మారుతున్న పరిస్థితులను చూసి చాలా మంది ప్రజలు భయపడుతున్నారు. అది కాలుష్యం అంటూ చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం అంతమైపోతుందంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: మరీ ఇంత అమానుషమా? కట్టేసి ఉన్న గేదె పైకి దూసుకెళ్లిన పాము.. కాపాడాల్సిన యజమాని ఏం చేస్తున్నాడో చూడండి..
ఆకాశం ఇలా గులాబీరంగులోకి మారడానికి థానెట్ ఎర్త్ (Thanet Earth) అనే గ్రీన్‌హౌస్ కాంప్లెక్స్ కారణమని అనుమానిస్తున్నారు. యూకేలోని 90 ఎకరాల్లో విస్తరించి ఉన్న పెద్ద పారిశ్రామిక వ్యవసాయం, మొక్కల కర్మాగారంలో పెద్ద ఎత్తున గులాబీ రంగు ఎల్‌ఈడీ లైట్లను (LED Lights) వినియోగస్తుంటారు. తక్కువ ఎత్తులో మేఘాలు ఏర్పడినపుడు ఈ ఎల్‌ఈడీ లైట్ల ప్రతిబింబాల వల్ల ఆకాశం అలా గులాబీ రంగులోకి మారినట్టు కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.