Share News

Snake Video: ముంగిసతో కొట్లాట.. ప్రాణభయంతో ఓ చిన్నారి నిద్రపోతున్న ఊయల పైకి ఎక్కిన పాము.. చివరకు..!

ABN , First Publish Date - 2023-10-16T10:30:01+05:30 IST

ఓ నాగుపాము ముంగిస బారినుండి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏకంగా చిన్నారి నిద్రపోతున్న ఊయల పైకి ఎక్కింది.

Snake Video: ముంగిసతో కొట్లాట.. ప్రాణభయంతో ఓ చిన్నారి నిద్రపోతున్న ఊయల పైకి ఎక్కిన పాము.. చివరకు..!

పాములు చాలా జుగుప్స కలిగించే జీవులు. పాములలో చాలారకాలు ఉన్నా విషపూరితమైన నాగుపాము, నల్లత్రాచు పేర్లు చెబితే మాత్రం వణికిపోతారు. ఇవి కాటు వేస్తే కేవలం క్షణాల నుండి నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. ఓ నాగుపాము ముంగిస బారినుండి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏకంగా చిన్నారి నిద్రపోతున్న ఊయల పైకి ఎక్కింది. ఈ సంఘటనకు సంబంధించి భయంకరమైన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితేయయ

పాములు(Snakes) తక్షణమే ప్రాణాలు తీసే జీవులలో ప్రథమమైనవి. చెట్లు, దట్టమైన పొదలు, పంటపొలాలలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఓ భారీ నాగుపాము(giant cobra) పంటపొలంలో నిర్మించిన ఓ ఇంటి పరిసరాల్లో సంచరిస్తుండగా ముంగిస(mongoose) చూసింది. అది వెంటనే పాము మీద దాడికి దిగింది(mongoose attack on cobra). వీడియోలో ఓ భారీనాగుపాము తో ముంగిస తలపడుతూ కనిపిస్తుంది. ముంగిస పోరాటం చాలా భీభత్సంగా ఉన్న కారణంగా ఆ పాము భయపడింది. ముంగిస నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి అటూ ఇటూ తిరుగుతూ చివరికి ఆ ఇంటి ఆరుబయట నిర్మించిన చిన్న వేదిక మీదకు వెళుతుంది. అయితే ఆ వేదికపై కప్పుకు ఉయ్యాల కట్టి ఆ ఊయలలో తమ చిన్నారిని పడుకోబెట్టారు ఆ ఇంటి వారు. . చుట్టుప్రక్కల ప్రజలు ఆ పామును తరమడానికి ప్లేట్లు, గ్లాసులు తీసుకుని శబ్ధాలు చేస్తారు. కానీ పాము అక్కడి నుండి వెళ్లిపోకుండా చిన్నారి ఊయల ఎక్కి మెల్లిగా ఊయల(cradle) తాడుకు పెనవేసుకుంటూ చాలా పైకి ఎక్కుతుంది. అది తన పడగ విప్పి తప్పించుకునే మార్గం కోసం వెతుకుతూ అక్కడ దండెం మీద ఆరేసిన బనియన్ లోకి తల దూర్చి ఇరుక్కుపోతుంది. పాము ఊయల పైకి ఎక్కిన విధానం, దాని పరిమాణం చూసి షాకవుతున్నారు. ఊయలలో ఉన్న చిన్నారి భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Dry Fruits: వేయించిన డ్రై ఫ్రూట్స్ తింటుంటారా? వీటి గురించి ఈ నిజాలు తెలుసా?


ఈ వీడియోను @dr_prashantsb అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ఎన్‌సిసి క్యాంపస్ లో పాములు గుడారాలలోకి రాకుండా ఉండటానికి గుడారం చుట్టూ ఒక అడుగు లోతు, ఒక అడుగు వెడల్పుతో డ్రెయిన్ లాంటి నిర్మాణం చేసేవారమని, గ్రామాల్లో, పంటపొలాలకు దగ్గరలో నివసించే వారు అది ఫాలో అవ్వడం మంచిది' అని క్యాప్షన్ లో మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'ఆ ఉయ్యాలలో నిజంగానే చిన్నారి ఉందా?' అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. 'ఇంటి బయట చెట్లకు, పైకప్పులకు ఉయ్యాలలు కట్టి పిల్లలను నిద్రపుచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ మనిషి పిల్లలను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఆ పాము పరిమాణం చూస్తే భయం వేస్తోంది. అలాంటిది చిన్నారి ఉయ్యాలపైకి ఎక్కడం నిజంగా భయంకరంగా ఉంది'అని ఇంకొకరు కామెంట్ చేశారు.

Viral Video: స్వీట్లంటే ఇష్టమా? ఆగ్రా ఫేమస్ అయిన ఓ స్వీట్ ను ఎలా తయారుచేస్తున్నారో చూస్తే..


Updated Date - 2023-10-16T10:42:17+05:30 IST