Snake Video: మనిషి టచ్ చేయగానే.. మరుక్షణంలోనే చనిపోయిన పాము.. ఏంటీ నమ్మలేకపోతున్నారా..? ఈ వీడియోను చూస్తే..!
ABN , First Publish Date - 2023-05-26T11:32:11+05:30 IST
మనిషి ముట్టగానే చనిపోయే పామును ఎప్పుడైనా చూశారా? మనిషి ముట్టగానే పాము చనిపోవడం ఏంటీ.. అని ఆశ్చర్యం వేస్తుందా? కానీ నిజమండీ బాబూ..
పాములంటే అందరికీ భయం. ఎక్కడైనా పాముందని తెలిస్తే వెతికి మరీ చంపేవాళ్ళు ఎక్కువ. అయితే పామును చంపడం కూడా అంత ఈజీ కాదు. అది జరజరా పాక్కుంటూ వెళుతోంటే దాన్ని పట్టుకోవడానికి చాలా కష్టపడాలి, ఆ తరువాత దాన్ని గురిచూసి చంపాలి. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా మనిషి ముట్టగానే చనిపోయే పామును ఎప్పుడైనా చూశారా? మనిషి ముట్టగానే పాము చనిపోవడం ఏంటీ.. అని ఆశ్చర్యం వేస్తుందా? కానీ నిజమండీ బాబూ.. మనిషి ముట్టగానే ఓ పాము చనిపోయింది. కళ్ళు తేలేసి మరీ ప్రాణాలు వదిలింది. ఇలా పాము మరణించే వీడియోను నేషనల్ జియోగ్రాఫిక్ వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
పాముల్ని(snakes) చూసి మనుషులు పారిపోతే.. మనుషుల్ని చూసి పాములు కూడా పారిపోతాయి. ఎవరి ప్రాణభయం వారిది. తమను తాము కాపాడుకోవడానికి(protecting themselves) మొక్కల నుండి జంతువుల వరకు చాలా వింత పద్దతులు పాటిస్తాయి. ఉమ్మెత్త పూవులు ముట్టగానే ముడుచుకుని పోవడం, అత్తిపత్తి ఆకులు ముడుచుకుని పోవడం చూస్తుంటాం. అలాంటి కోవకు చెందిందే ఈ పాము కూడా. ఈ పాము మనిషి ముట్టగానే చనిపోతుంది. కళ్ళు తేలేసి, చనిపోయాక ఎలాగైతే గట్టిగా కర్రలాగా బిగుసుకుని పోతుందో అలా అయిపోతుంది. అది నిజంగా చనిపోయిందా అంటే కాదండీ బాబూ.. అదంతా దాని యాక్టింగ్(snake act like dead). ఎవరైనా దాన్నిముట్టుకోగానే తనని చంపుతారేమో దాని భయం. ఎవరూ చంపకుండా ముందే అవి ఇలా చనిపోయినట్టు నటిస్తాయట. ఈ ఇండిగో పాములు(Indigo snakes) చాలా విషపూరితమైనవని చెబుతారు. ఈ పాములు తమని తాము కాపాడుకోవడానికి ఇలా చేస్తాయని నేషనల్ జియోగ్రాఫిక్ వారు తెలిపారు.
Viral News: పురిటి నొప్పులు వస్తున్నాయని భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తే.. బిడ్డను భర్త చేతిలో పెట్టినట్టే పెట్టి భారీ షాకిచ్చారు..!
ఈ వీడియోను National Geographic యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ పాము నటనకు అవాక్కవుతున్నారు. 'వామ్మో అది మరీ ఇంత స్మార్ట్ గా ఉందేంటి?' అంటున్నారు. 'ఈపాము నటనకు ఆస్కార్ ఇచ్చేయచ్చు' అని చమత్కారం చేస్తున్నారు.