Viral Video: వధువు కొడుకునంటూ పెళ్లిలో ఈ పిల్లాడు స్పీచ్‌ను విని పడీపడీ నవ్వుకున్న బంధువులు.. కానీ అంతలోనే..!

ABN , First Publish Date - 2023-09-13T15:18:45+05:30 IST

తన తల్లి పెళ్లిలో ఉద్వేగభరితమైన ప్రసంగం చేస్తున్న కొడుక్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. నవ్విస్తూనే ఏడిపించిన ఆ కుర్రాడి ప్రసంగం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కుర్రాడు ఇచ్చిన స్పీచ్ చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Viral Video: వధువు కొడుకునంటూ పెళ్లిలో ఈ పిల్లాడు స్పీచ్‌ను విని పడీపడీ నవ్వుకున్న బంధువులు.. కానీ అంతలోనే..!

తన తల్లి (Mother) పెళ్లిలో (Wedding) ఉద్వేగభరితమైన ప్రసంగం చేస్తున్న కొడుక్కి (Son) సంబంధించిన వీడియో (Viral Video) సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. నవ్విస్తూనే ఏడిపించిన ఆ కుర్రాడి ప్రసంగం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. goodnews_movement అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కుర్రాడు ఇచ్చిన స్పీచ్ చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

``గుడ్ ఈవెనింగ్. నా పేరు జోర్డాన్. నేను వధువుకు కొడుకును. వరుడికి నేను అధికారికంగా సవతి కొడుకును. మా అమ్మను వివాహం చేసుకుంటున్న విన్నీని నేను కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాను. అతడికి బై వన్ గెట్ వన్ ఆఫర్ వచ్చింది. మా అమ్మతో పాటు నేను కూడా అతడి సొంతమయ్యాను. మా అమ్మను వివాహం చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు విన్నీ. విన్నీని వివాహం చేసుకుంటున్నందుకు థ్యాంక్యూ మమ్మీ. ఒంటరిగా ఉంటూ నన్ను ఎంతో క్రమశిక్షణతో పెంచినందుకు ధన్యవాదాలు`` అంటూ ఆ కుర్రాడు చాలా అద్భుతంగా మాట్లాడాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 7 లక్షల మంది వీక్షించారు. 53 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ``నేను తల్లిని కాను. కానీ, ఆ కుర్రాడి ప్రసంగానికి కన్నీళ్లు వచ్చాయి``, ``మాకు ప్రపంచంలో ఎక్కువ మంది జోర్డాన్‌లు కావాలి! అలాగే విన్నీలు కూడా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-13T15:18:45+05:30 IST