Viral Video: శుఛీ, శుభ్రత అక్కర్లేదా? పానీపూరీలను ఎలా ఇస్తున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2023-06-24T19:02:57+05:30 IST

ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అందరూ పానీపూరీ తినడాన్ని ఎంతగానో ఇష్టపడతారు. మన దేశంలో అత్యంత ఎక్కువ మందికి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇది. ఏ రోడ్డులో చూసినా, ఏ సందులోనైనా పానీపూరీ బడ్డీ, దాని చుట్టూ లొట్టలేసుకుంటూ తినే జనాలు కనిపిస్తుంటారు.

Viral Video: శుఛీ, శుభ్రత అక్కర్లేదా? పానీపూరీలను ఎలా ఇస్తున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అందరూ పానీపూరీ (Paani Puri) తినడాన్ని ఎంతగానో ఇష్టపడతారు. మన దేశంలో అత్యంత ఎక్కువ మందికి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇది. దీనిని కొన్ని ప్రాంతాల్లో గోల్‌గప్పా (Golgappa) అని కూడా అంటారు. ఏ రోడ్డులో చూసినా, ఏ సందులోనైనా పానీపూరీ బడ్డీ, దాని చుట్టూ లొట్టలేసుకుంటూ తినే జనాలు కనిపిస్తుంటారు. అయితే పానీపూరీ తయారీలోనూ, విక్రయం సమయంలోనూ శుఛీ, శుభ్రత (Un hygienic) పాటించరని చాలా మంది ఆరోపిస్తుంటారు. అలాంటి వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ (Viral Video) అయ్యాయి. తాజాగా మరోసారి అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది.

రాజస్థాన్‌లోని జైపూర్‌ (Jaipur)లో ట్రిపోలియా మార్కెట్‌లో రోడ్డు పక్కన బండిపై ఓ వ్యక్తి పానీపూరీ విక్రయిస్తున్నాడు. అతను జనాలను ఆకట్టుకునేందుకు కాస్త వెరైటీగా వ్యాపారం చేస్తున్నాడు. తన వద్దకు వచ్చే కస్టమర్లకు డ్యాన్స్ చేస్తూ పానీపూరీని (Dancing Paanipuri Wala) అందిస్తున్నాడు. ఆ డ్యాన్సింగ్ పానీపూరీ వాలాను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఊహించని విధంగా నెటిజన్లు ఆ పానీపూరీ వాలాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Viral Video: అట్టపెట్టెలో దాక్కున్న ప్రియుడు.. సర్‌ప్రైజ్ చేద్దామనుకుంటే షాకిచ్చిన ప్రేయసి.. అడ్డంగా దొరికిపోవడంతో..!

ఆ వీడియోలో అతడు ఒట్టి చేతులతో మసాలాను కలిపి, పూరీలో నింపి డ్యాన్స్ చేస్తూ వినియోగదారులకు వేగంగా అందిస్తున్నాడు. అయితే మధ్య మధ్యలో తన ముక్కుపై రాసుకోవడం వంటివి చేస్తున్నాడు. ఆ తర్వాత అదే చేతులతో పూరీలో పానీ నింపి ఇచ్చేస్తున్నాడు. ఆ పానీపూరీ వాలా అందిరికీ డయేరియా పంచుతున్నాడని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాంటి అనారోగ్యకర స్ట్రీట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-24T19:02:57+05:30 IST