Success Story: చదువుదేముంది బాసూ.. టాలెంట్ ఉంటే చాలని నిరూపించిన కుర్రాడు.. రూ.2463 కోట్ల వ్యాపారం వెనుక..!
ABN , First Publish Date - 2023-07-14T14:37:33+05:30 IST
'పండిత పుత్ర పరమ శుంఠ' అంటారంతా.. ఇతరుల విషయాల్లో ఏమో కానీ ఈ కుర్రాడి విషయంలో మొదట అందరూ అదే అన్నారు. కానీ..
'పండిత పుత్ర పరమ శుంఠ' అంటారంతా.. ఇతరుల విషయాల్లో ఏమో కానీ ఈ కుర్రాడి విషయంలో మొదట అందరూ అదే అన్నారు. ఉపాధ్యాయుడి కొడుకైన ఈ కుర్రాడు కాలేజీ లో చేరాక రెండు సార్లు ఫెయిలయ్యాడు. ఇతడిని చూసిన వారు 'చదువు సంధ్యా అబ్బలేదు, ఇక వీడేం సాధిస్తాడు'అని చెవులు కొరుక్కున్నారు. కానీ 'చదువుదేముంది బాసూ.. టాలెంట్ ఉంటే చాలు సక్సెక్ అదే వస్తుంది' అని అనుభవపూర్వకంగా నిరూపించాడు. ఒకటి రెండు కాదు ఏకంగా రూ.2463కోట్ల ఇతని వ్యాపారం కథ ఏంటి? ఇతనెవరు? పూర్తీగా తెలుసుకుంటే..
బీహార్ రాష్ట్రం(Bihar), నలంద జిల్లాలో మిస్భా అష్రఫ్(Misbah Ashraf) జన్మించాడు. ఇతని తండ్రి స్కూల్ టీచర్, తల్లి గృహిణి. వీరిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. కానీ అష్రఫ్ ఎప్పుడూ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలని అనుకునేవాడు. కానీ చదువులో ఇతను అంతగా ప్రతిభావంతుడు కాదు. ఎంత కష్టపడినా కాలేజీ చదువులో రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు. ఆ తరువాత అతను సెకెండ్ ఇయర్ లో ఉండగా సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. దీంతో కాలేజీ చదువుకు ముగింపు పలికాడు. దీని తరువాత అతను సొంతంగా సిబోలా(cibola) అనే పేరుతో ఓ స్టార్టప్ ప్రారంభించాడు. అయితే అతని మొదటి అడుగు దారుణమైన ఫలితాన్నిచ్చింది. కేవలం 4నెలలోనే విఫలమైంది. ఇది అతనికి, అతని మధ్యతరగతి జీవనానికి చాలా పెద్ద ఎదురుదెబ్బ. కానీ అతను దాన్ని తట్టుకుని నిలబడ్డాడు. రెండవ ప్రయత్నంగా మార్స్ ప్లే(Marsplay) ను ప్రారంభించాడు. ఇది ఫ్యాషన్, బ్యూటీ ప్రోడక్ట్స్ కు మంచి వాణిజ్య వేదికగా సక్సెస్ అయ్యింది. అయితే ఓ పెద్ద సంస్థ అష్రఫ్ నుండి దీన్ని కనుగోలు చేసింది. దీని తరువాత కరోనా కాలంలో అష్రఫ్ తన మూడవ స్టార్టప్ ను ప్రారంభించాడు. అలా అతని ఆలోచనల్లో పుట్టిందే జార్(Jar).
Viral News: పొలంలో పనిచేస్తుండగా బయటపడిందో పెట్టె.. అనుమానంగానే ఓపెన్ చేసిన రైతుకు భారీ షాక్.. 157 ఏళ్ల క్రితం నాటి..!
జార్.. భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలకు పొదుపు, పెట్టుబడి ఎలా పెట్టాలో సహాయపేడే వేదిక. భారతదేశంలో ఎన్నో కుటుంబాలు బంగారాన్ని ఆరోగ్యకరమైన పెట్టుబడిగా ఎలా మారుస్తున్నాయో అర్థం చేసుకుని ఆ ఆలోచనతో ఆవిర్భవించింది. ఇది 18నెలల కాలంలో 11మిలియన్ల వినియోగదారుల మార్క్ దాటింది. దాదాపు 467కోట్ల నిధులను సేకరించింది. దీని తరువాత దశలో ఇందులో ఏకంగా రూ.2463కోట్ల వ్యాపారం జరిగింది. ఇలా కాలేజీ డ్రాపవుట్ అయిన కుర్రాడు కోట్ల వ్యాపారంతో సక్సెస్ ను తన అకౌంట్ లో వేసుకున్నాడు. ప్రస్తుతం మిస్బా అష్రప్ నికర విలువ 164కోట్లు. ఇతను భారతదేశంలో ఎంతో మంది యువతకు స్పూర్తిగా నిలుస్తున్నాడు.