Sugarcane Juice: ఎండాకాలం చెరకు రసం మంచిదే.. కానీ తయారు చేసిన 20 నిమిషాల తర్వాత తాగితే జరిగేది ఇదే..!
ABN , First Publish Date - 2023-04-06T20:02:01+05:30 IST
మండిపోతున్న ఎండల్లో ఈ జ్యూస్ తాగితే ప్రాణం లేచొస్తుందనే చెప్పాలి. చాలామంది చెరకురసం తయారుచేయించుకుని పార్శిల్ తీసుకెళ్తుంటారు. కానీ చెరకురసం తయారుచేసిన 20నిమిషాల తరువాత(after 20 minutes) తాగితే..
మండిపోతున్న ఎండల్లో చెరకు రసం(sugarcane juice) తాగితే చాలా బావుంటుంది. అప్పటికప్పుడు చెరకును మెషీన్లో వేసి రసం తీసి, దానికి కాస్త నిమ్మరసం, కాసిన్ని ఐస్ ముక్కలు కలిపి ఇస్తుంటారు. ఈ జ్యూస్ తాగితే ప్రాణం లేచొస్తుందనే చెప్పాలి. వేసవి తాపాన్నితగ్గించి శరీరాన్ని హైడ్రేట్(hydrate)గా ఉంచడంలో చెరకురసం బాగా పనిచేస్తుంది. చాలామంది చెరకురసం తయారుచేయించుకుని పార్శిల్ తీసుకెళ్తుంటారు. కానీ చెరకురసం తయారుచేసిన 20నిమిషాల తరువాత(after 20 minutes) తాగితే మాత్రం కొంప కొల్లేరే .. అసలు చెరకు రసం ఆరోగ్యానికి చేసే మంచేంటి? చెడేంటి? తెలుసుకుంటే..
శీతలపానీయాలతో(Cool drinks) పోలిస్తే చెరకు రసం ఎంతో ఆరోగ్యం(Sugarcane juice good for health).. శరీరానికి రోగనిరోధక శక్తి(Immunity power)ని ఇచ్చి శరీరంలలో ప్రోటీన్ లెవల్స్ పెంచే(Increase protein level) మ్యాజిక్ డ్రింక్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇందులో ఫైబర్(Fiber), పొటాషియం(potassium), జింక్(zinc), ఫాస్పరస్(Phosphorus), కాల్షియం((calcium), ఐరన్(iron), విటమిన్-ఎ(vitamin-A), విటమిన్-బి(vitamin-B), విటమిన్-సి(vitamin-C) సమృద్దిగా ఉంటాయి. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది(Protect kidney, heart health). ఇందులో ఉండే ఫెనోలిక్స్ కాంపౌండ్స్(phenolic compounds) వృద్దాప్యాన్ని ఆమడదూరంలో ఉంచుతాయి. అందుకే క్రమం తప్పకుండా చెరకురసం తాగడం మంచిదేనని చెబుతారు వైద్యులు. ఇన్ని ప్రయోజనాలు కలిగించే అమృతం లాంటి చెరకు రసం చేటు చేస్తుందంటే నమ్మగలరా?
Fridge: ఫ్రిడ్జ్ డోర్లను ఓపెన్ చేసి ఉంచితే జరిగేదేంటి..? నిజంగా గది అంతా చల్లగా అయిపోతుందా..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివి..!
చెరకు రసం మెషీన్ నుండి తీసిన 20నిమిషాలలోపు తాగెయ్యాలి. ఆ సమయం కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచిన చెరకురసం ఆక్సీకరణ(oxidation) చెంది ఉంటుంది. అది తాగితే వాంతులు(vomiting), కడుపునొప్పి(stomach ache), కళ్ళు తిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
చెరకురసంలో పొలికోసనాల్(policosanol) ఎక్కువగా ఉంటాయి. ఇవి నిద్రకు ఆటంటం కలిగిస్తాయి. నిద్రలేమి సమస్య(insomnia) కంటిన్యూ అయితే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. అలాగే ఈ పొలికోసనాల్ రక్తాన్ని పలుచగా(blood transfusion) చేస్తుంది. ఈకారణంగా రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గుతుంది.
చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల చెరకు రసంలో కేలరీలు(high calories) ఎక్కువగా ఉంటాయి. రోజుకు రెండు గ్లాసులకు మించి చెరకు రసం తాగితే చాలా సులువుగా బరువు పెరుగుతారు. అధికబరువు ఉన్నవారు దీనికి దూరం ఉండటం మంచిది.