Swiggy delivery boy: పాపం.. అతను అందరి ఆకలీ తీరుస్తాడు.. రోడ్డు పక్కన కూర్చుని తన ఆకలి ఎలా తీర్చుకుంటున్నాడో చూడండి..
ABN , First Publish Date - 2023-09-01T12:58:11+05:30 IST
ఇంటింటికి వెళ్లి ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ గురించి మనందరకీ తెలిసిందే. ఎండలో, వానలోనూ, రాత్రి వేళల్లోనూ ఎన్నో కిలోమీటర్లు తిరుగుతూ వారు అందరికీ ఆహారం అందిస్తుంటారు. ఆ క్రమంలో వారు భోజనం చేసేందుకు కూడా సమయం ఉండదు. ఏ మాత్రం లేటైనా కస్టమర్ల నుంచి ఫోన్లు వచ్చేస్తుంటాయి.
ఇంటింటికి వెళ్లి ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ (Food delivery boys) గురించి మనందరకీ తెలిసిందే. ఎండలో, వానలోనూ, రాత్రి వేళల్లోనూ ఎన్నో కిలోమీటర్లు తిరుగుతూ వారు అందరికీ ఆహారం అందిస్తుంటారు. ఆ క్రమంలో వారు భోజనం చేసేందుకు కూడా సమయం ఉండదు. ఏ మాత్రం లేటైనా కస్టమర్ల నుంచి ఫోన్లు వచ్చేస్తుంటాయి. దాంతో వారు గంటల తరబడి నాన్-స్టాప్‌గా పని చేస్తూనే ఉంటారు. టీ, స్నాక్స్‌తో తమ ఆకలి తీర్చుకుంటారు. కొన్ని రోజులుగా ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ (Swiggy delivery boy)కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
వారం రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో (Emotional Video) ఎంతో మందిని భావోద్వేగానికి గురి చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకు 30 లక్షల మందికి పైగా వీక్షించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఒక షాప్ బయట కూర్చుని కొన్ని బిస్కెట్లతో టీ తాగుతూ కనిపించాడు. వాటితోనే తన ఆకలి తీర్చుకుని మళ్లీ బైక్ ఎక్కి వెళ్లిపోయాడు. macho_mealss అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.
Viral Video: వామ్మో.. టైర్లకు పంక్చర్లు వేసేటపుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఈ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు!
ఈ వీడియోను 55 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియో చూసి చాలా మంది నెటిజన్లు ఎమోనల్ అయ్యారు. ``ఇలాంటి వారందరితోనూ దయగా వ్యవహరించండి``, ``కష్టపడి పని చేసే వారిని గౌరవించాలి``, ``మనం ఇచ్చే రూ.50 టిప్ వారికి ఎంతో ఎక్కువ``, ``వారిది చాలా కష్టమైన ఉద్యోగం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.