Tea: బాబోయ్.. టీ ని ఇలా కూడా తయారు చేస్తారా..? దీన్ని తాగే దమ్ము ఎవరికైనా ఉందా అంటూ నెటిజన్ల సెటైర్లు..!
ABN , First Publish Date - 2023-11-28T12:11:28+05:30 IST
టీ అనేది కేవలం పానీయం కాదు. అదొక ఎమోషన్. కానీ ఈ మహిళ చేసిన టీ చూస్తే..
టీ అనేది కేవలం పానీయం కాదు. అదొక ఎమోషన్. విదేశాల నుండి పరిచయమైనా సరే భారతీయులు కాఫీ, టీలను గుండెల్లో పెట్టుకున్నారు. కేవలం టీ అమ్ముతూ ప్రతి నెలా లక్షలు సంపాదిస్తున్న వీధి వ్యాపారులు బోలెడు మంది ఉన్నారు. టీ ప్రియుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాలలో విభిన్న రకాల టీలు తయారుచేసి అమ్ముతుంటారు. అయితే ఓ మహిళ మాత్రం టీ తో దారుణమైన ప్రయోగం చేసింది. ఆమె టీ తయారుచేయడం చూస్తే భయపడతారు. దీన్ని చూసిన నెటిజన్లు దాన్ని తాగే ధైర్యం ఎవరికుంది బాబోయ్ అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టీ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
బాగా అలసిపోయినప్పుడు తిరిగి ఉత్సాహంగా పనిచేయాలన్నా, తలనొప్పిగా ఉన్నప్పుడు దానికి చెక్ పెట్టాలన్నా టీ(Tea) తాగడం చాలా మంది అలవాటు. ఇందులోని కెఫిన్ మెదడును ఉత్తేజపరిచి చురుగ్గా ఉండేలా చేస్తుంది. అయితే ఓ మహిళ టీతో దారుణమైన ప్రయోగం చేసింది. వీడియోలో ఓ మహిళ మొదట పాన్ లో టీ పొడి వేస్తుంది. ఆ వెంటనే పంచదార కూడా వేస్తుంది. ఆ తరువాత పంచదార టీ పొడిలో కరిగిపోతున్నప్పుడు అందులోకి అల్లం ముక్కలు, యాలకులు వేస్తుంది. ఆ తరువాత అందులోకి కొన్ని నీళ్లు పోస్తుంది. అదంతా గ్రేవీ లాగా బాగా ఉడికిస్తుంది. నీళ్లు ఇమిరిపోయి అవన్నీ బాగా మాడిపోయే వరకు వేయిస్తుంది. ఆ తరువాత పాలు పోస్తుంది. పాన్ మీద మూత పెట్టి దాన్ని బాగా ఉడికిస్తుంది. పాలు టీ పొడి రెండూ బాగా ఉడికిన తరువాత దాన్ని వడగట్టి టీ గ్లాసులలో సర్వ్ చేస్తుంది. నిజానికి ఈ మధ్యకాలంలో క్యారామిల్ టీ పేరుతో ఇది వైరల్ అవుతోంది. పలు కుకింగ్ ఛానెల్స్ దీన్ని భీభత్సంగా తయారుచేసి సోషల్ మీడియాలో పెడుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఈ 10 పక్షులను కొనాలంటే ఆస్తులమ్మినా చాలదు.. ఒక్కోదాని ధర ఎంతంటే..!
ఈ టీకి సంబంధించిన వీడియోను Monica Jasuja అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ లో పోస్ట్ చేశారు. 'ఈ టీ తయారువిధానాన్ని నేను గట్టిగా ఖండిస్తన్నాను. దీని గురించి సుప్రీం కోర్టులో పిటిషన్ వేద్దామా?' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడీయో చూసిన నెటిజన్లు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పలు సెటైర్లు కూడా వేస్తున్నారు. 'ఇది టీ కాదు, టీ పొడితో చేసిన కర్రీ' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఎవరైనా టీతో ఇన్ని ప్రయోగాలు ఎందుకు చేస్తారు? మామూలుగానే చేయవచ్చు కదా?' అని ఇంకొకరు అన్నారు. 'అది టీ కాదు. భయంకరమైన టీ టిక్కా మసాలా గ్రేవీ' అని ఇంకొకరు కామెంట్ చేశారు.