Tea: సాయంత్రమైతే చాలు టీ షాప్‌కు వెళ్లి మగాళ్లంతా చేసే పని ఇదే.. కానీ అదెంత డేంజరో తెలిస్తే.. ఇక వాటి జోలికే వెళ్లరు..!
ABN , First Publish Date - 2023-04-12T18:04:32+05:30 IST
టీకొట్టు దగ్గరకెళ్ళి టీ తాగుతూ చేసేపని ఇంకొకటుంటుంది. అది ప్రాణలకే ఎసరు పెడుతుందనే చావు కబురు బయటకు వచ్చింది
సాయంత్రమవ్వగానే కుర్రాళ్ళ దగ్గరనుండి పెద్దలవరకు టీ కొట్టు దగ్గర చేరతారు. ఒకప్పుడు పల్లెటూళ్ళలో రచ్చబండ దగ్గర చేరి లోకాభిరామాయణం మాట్లాడుకునేవారు. ఇప్పుడు రాజకీయాల నుండి సినిమాల వరకు, ఊళ్ళో తాజా విషయాల నుండి ఇంట్లో కొట్లాటల వరకు అన్నీ చెప్పుకోవడానికి టీకొట్టు చక్కని స్పాట్. టీ అనేది చాలా మందికి ఒక సాకు మాత్రమే.. అయితే మాట్లాడుకోవడానికి టీకొట్టు దగ్గరకెళ్ళి టీ తాగుతూ చేసేపని ఇంకొకటుంటుంది. అది ప్రాణలకే ఎసరు పెడుతుందనే చావు కబురు బయటకు వచ్చింది. టీ కొట్లు దగ్గర జరుగుతున్న అంత ఘోరం ఏమిటో పూర్తీగా తెలుసుకుంటే..
చాలామంది మగాళ్ళు సాయంత్రం టీకొట్టు(tea shop) దగ్గరకు వెళ్ళగానే చేసే పని 'అన్నా ఓ సిగరెట్ ఇవ్వు' అనో.. 'బాబు ఓ సిగరెట్' అనో అనడం. సిగరెట్ తాగే అలవాటు(smoking habit) ఉన్నవారు టీ కొట్టు దగ్గర మొదట సిగరెట్(cigarette) తీసుకుంటారు. ఆ తరువాత టీ తాగుతూ మధ్యలో సిగరెట్ దమ్ము లాగుతూ ఉంటారు(smoking while tea drinking). కానీ టీతో పాటు సిగరెట్ తాగడం చాలా డేంజరనే చావుకబురు బయటపడింది. టీతో పాటు సిగరెట్ తాగితే క్యాన్సర్(Cancer) వచ్చే ప్రమాదం సాధారణం కంటే 30శాతం ఎక్కువ ఉంటుంది. టీలో ఉంటే టాక్సిన్లు(toxins) సిగరెట్ పొగతో కలసి ఊపిరితిత్తుల(effect on lungs) మీద దారుణమైన ప్రభావాన్ని చూపుతాయి. పొరపాటున కూడా టీతో సిగరెట్ తాగకండి.
AC: ఏసీ ఆన్ చేయగానే కొందరికి ఎందుకిలా జరుగుతుంది..? చాలా మందికి తెలియని నిజాలివి..!
సాయంత్రమవ్వగానే టీతో పాటు ఏదైనా తినడం చాలామందికి అలవాటు. టీకొట్టు దగ్గర వేడివేడిగా శనగపిండితో పకోడీలు, వడలు అమ్ముతుంటారు. వీటితో వాటు సమోసాలు అదనం. చాయ్-బిస్కట్ అనీ()chai-biscuit), చాయ్-సమోసా(chai-samosa) అని కాంబినేషన్లతో రెచ్చిపోయేవాళ్ళు ఉంటారు. ఇక వర్షం పడేరోజుల్లో అయితే వీటికి మరింత ఊపొస్తుంది. అయితే టీతో ఇలా స్నాక్స్ తినడం ఆరోగ్యపరంగా అస్సలు మంచిది కాదు. టీతో ఇవి తింటే జీర్ణాశయ గోడల సామర్థ్యం తగ్గిపోతుంది(discrease strength of digestive walls). ముఖ్యంగా పకోడీలు, మిర్చిబజ్జీలు తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయ(raw onion) కూడా తింటుంటారు. ఇది చాలా హాని చేస్తుంది.
టీతో పాటు వేయించిన జీడిపప్పు, బాదం(fried cashew, almond) లాంటివి తినే అలవాటుంటే మాత్రం ఈ క్షణమే మానేయండి. నట్స్ లో మంచి పోషకాలు ఉంటాయి. టీలో ఉండే టాక్సిన్లు శరీరానికి ఈ పోషకాలు అందకుండా చేస్తాయి. అలాగే టీతో పాటు సిట్రస్ ఆధారిత పదార్థాలు ఏమీ తీసుకోకూడదు. ఇది కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి చేస్తుంది. శరీరానికి ఐరన్ అందకుండా చేస్తుంది.