Primary School Teacher: స్కూల్ టీచర్‌గా పనిచేయడమంటే మాటలు కాదండోయ్.. ఈ మాస్టారు షేర్ చేసిన వీడియోను చూస్తే..!

ABN , First Publish Date - 2023-09-06T18:19:53+05:30 IST

ప్రతి విద్యార్థి ఎదుగుదలలోనూ గురువుదే కీలక పాత్ర. మంచి గురువును అనుసరించిన వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు. అయితే ఓ వ్యక్తి జీవితంలో గురువు స్థానంలో ఉండడం అంత సులభం కాదు. తాజాగా ఓ వ్యక్తి స్కూల్ టీచర్ ఉద్యోగం ఎలా ఉంటుందో వివరిస్తూ ఓ వీడియో రూపొందించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Primary School Teacher: స్కూల్ టీచర్‌గా పనిచేయడమంటే మాటలు కాదండోయ్.. ఈ మాస్టారు షేర్ చేసిన వీడియోను చూస్తే..!

ప్రతి విద్యార్థి (Student) ఎదుగుదలలోనూ గురువుదే (Teacher) కీలక పాత్ర. మంచి గురువును అనుసరించిన వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు. అయితే ఓ వ్యక్తి జీవితంలో గురువు స్థానంలో ఉండడం అంత సులభం కాదు. తాజాగా ఓ వ్యక్తి స్కూల్ టీచర్ (School Teacher) ఉద్యోగం ఎలా ఉంటుందో వివరిస్తూ ఓ వీడియో రూపొందించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. englishwalesirrr అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. అతను ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ టీచర్‌గా పని చేస్తున్నాడు.

ఒకరోజులో ఓ ఉపాధ్యాయుడి జీవితం ఎలా ఉంటుందో అతడు వివరించాడు. ``ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉండడం సులభం కాదు. అలాగని కష్టం కూడా కాదు`` అని అతను వివరించాడు. తరగతిలోని పిల్లలందరితోనూ కలిసి పోతానని, మధ్యాహ్న భోజన సమయంలో వారితో కలిసి భోజనం చేస్తానని తెలిపాడు. ప్రతిరోజూ కొత్త బ్యాచ్ పిల్లలతో కూర్చుని మాట్లాడతానని పేర్కొన్నాడు. అప్పుడే పిల్లల ఆలోచన విధానం అర్థమవుతుందని, ఆ విధానం ద్వారానే తన విద్యార్థుల్లో కొందరు పుస్తకాల నుంచి ఏమీ నేర్చుకోవడం లేదనే విషయం అర్థమైందని తెలిపాడు (Teacher Video).

Richest YouTuber: బాబోయ్.. యూట్యూబ్ చానెల్‌తో ఇంత సంపాదనా..? నెలకు కోటి ఆదాయం.. దుబాయిలో రూ.60 కోట్ల ఇల్లు..!

విద్యార్థులతో అతను మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఇప్పటివరకు 24 లక్షల మంది వీక్షించారు. 2.5 లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇలాంటి గురువు విద్యార్థుల జీవితాల్లో చాలా కీలక పాత్ర పోషించగలడు``, ``ఆ విద్యార్థులు అదృష్టవంతులు``, ``ఉత్తమ గురువు`` అని నెటిజన్లు ప్రశంసించారు.

Updated Date - 2023-09-06T18:19:53+05:30 IST