Thammareddy Bharadwaj: ఎవడెవడు ఎవడెవడిని ఏ అవార్డుల కోసం ఏమి అడుక్కున్నారో నాకు తెలుసు
ABN , First Publish Date - 2023-03-10T16:17:05+05:30 IST
తమ్మారెడ్డి భరద్వాజ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ, నాగబాబు ని, రాఘవేంద్ర రావు ని తిరిగి విమర్శించారు. ఎవడు ఎవడి కాళ్ళు అవార్డుల కోసం పట్టుకున్నాడో, అలాగే ల్యాండ్ కోసం ఎలా లెటర్ రాసారో నేను నోరు విప్పితే అందరి అకౌంట్స్ బయట పడతాయి అని ఆవేశంగా చెప్పిన తమ్మారెడ్డి ఇంకా ఏమన్నారంటే...
ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ (Thammareddy Bharadwaj), నాగబాబుకి (Nagababu), కె. రాఘవేంద్ర రావు (K Raghavendra Rao) కి తిరిగి గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను నోరు తెరిచి ఒక్కొక్కడు అకౌంట్స్ చెపితే అసలు తట్టుకోగలరా అని ఆవేశంగా చెప్పారు. నేను ఏమైనా కామెంట్ చేస్తే ఎవరో ఒకరు అది రాద్ధాంతం చేసి మాట్లాడుతూ వుంటారు, నేను పట్టించుకోను. కానీ ఈసారి ఇండస్ట్రీ మనుషులే నా గురించి మాట్లాడుతుంటే ఇంక ఊరుకోలేక వారికి సమాధానం చెప్పాలని అనుకున్నాను, అని చెప్పారు తమ్మారెడ్డి.
మనుషలకి సమాధానం చెప్పక్కరలేదు, కానీ ఇండస్ట్రీ కి చెప్పాలి, అందుకనే ఈ వివరణ అని చెప్పుకొచ్చారు, తమ్మారెడ్డి. తాను 'ఆర్.ఆర్.ఆర్' (RRR) మీద మాట్లాడినదానికి చాలామంది ట్విట్టర్ లో, ఇంకొందరు ఇంకో విధంగా ఎవడికి తోచిన విధంగా వాళ్ళు దీని మీద స్పందించారు. అయితే ఇప్పటికీ నేను ఏమన్నానో దానికి కట్టుబడే వున్నాను. నేను తప్పు చెయ్యలేదు కాబట్టి క్షమాపణ చెప్పను. ఇంతకు ముందు రాజమౌళి (Rajamouli) ఇండియా కి ప్రైడ్ అంటే ఎవడూ పట్టించుకోలేదు. అలాగే ట్రిపిల్ ఆర్ భారత దేశానికీ గర్వకారణం అంటే ఎవడూ మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఒక క్లిప్పింగ్ తీసుకొని దాని గురించి తెలియకుండా ఇంత రాద్ధాంతమా, అని ఆవేశంగా అడిగారు తమ్మారెడ్డి.
రాజేష్ టచ్ రివర్ సినిమాల మీద సమీక్షలో చిన్న సినిమాల గురించి మూడు గంటల చర్చలో ఈ మాటలు ఫ్లో లో వచ్చాయి. అవి ఏ సందర్భంలో అన్నానో, ఎక్కడ అన్నానో చూడకుండా, ఒక చిన్న క్లిప్పింగ్ పట్టుకొని నీకు అకౌంట్స్ తెలుసా అని ఒకడు అడుగుతాడా, అని ఆవేశం తో చెప్పారు తమ్మారెడ్డి. అయితే నాకు చాలామంది అకౌంట్స్ తెలుసు, అవార్డుల కోసం ఎవడి కాలు ఎవడు పట్టుకున్నాడో కూడా నాకు తెలుసు. పదవుల కోసం ఎవడు ఎవడిని అడుక్కున్నారో కూడా నాకు తెలుసు, నేను అందరి అకౌంట్స్ గురించి నోరు విప్పితే ఎక్కడుంటారు మీరు, అని తమ్మారెడ్డి ఆవేశంగా అన్నారు.
అసలు ఇలా అడిగిన మీ అందరికి మూడు గంటల సేపు చిన్న సినిమాల మీద చర్చలో కూర్చోగలరా. అంత ఓపిక లేదు, వినే ఓపిక లేదు, కానీ మీరు ఎదో క్లిప్పింగ్ పట్టుకొని విమర్శిస్తారా, అని చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు తమ్మారెడ్డి.
ఇంకొకడు నీ అమ్మ మొగుడు అంటాడా, నా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పాడు, నిజాయితీ నేర్పాడు, నీతి నేర్పాడు. నువ్వు నిజాయితీగా మాట్లాడతావా, నిజం చెప్పగలవా, నేను బూతులు మాట్లాడగలను, కానీ నాకు సంస్కారం వుంది, అందుకని నేను అన్నాను. ఇండస్ట్రీ అంటే తల్లి లాంటిది నాకు, ఇక్కడే బతికాను, ఇక్కడే పెరిగాను, అని నాగబాబు కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తమ్మారెడ్డి.
మీకు సిగ్గు లేకపోతే నాకుంది. నాకు మానం మర్యాద వుంది. ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మొహం మీద పడుతుంది, నువ్వా నా గురించి మాట్లాడుతున్నావు. నీకు అర్హత లేదు. ల్యాండ్ కోసం ప్రభుత్వాలకి ఎలా లెటర్స్ రాసి తీసుకున్నారో, ఇవ్వకపోతే ఎలా విమర్శించారో, లేదా ఎలా కాళ్లు పట్టుకున్నారో ఇవన్నీ తెలీదా. మిమ్మల్ని విమర్శిస్తే ఇండస్ట్రీ ని అన్నట్టే, అందుకే నేను ఏమి అనను అని ఆవేశంగా చెప్పారు తమ్మారెడ్డి.