అమ్మబాబోయ్.. పెళ్ళిలో స్వీట్లు బాలేవని ఈ పెళ్ళికొడుకు ఎంత ఘోరం చేశాడు.. పెళ్ళికూతురు తమ్ముడిని ఎత్తుకెళ్ళి ఏకంగా..
ABN , First Publish Date - 2023-04-17T19:37:31+05:30 IST
భోజనంలో స్వీట్లు(Sweets) బాలేవనే కారణంతో ఓ పెళ్లికొడుకు(groom) పెళ్ళికూతురు కుటుంబంతో గొడవకు దిగాడు. అంతటితో ఊరుకోకుండా 9ఏళ్ళ పెళ్లికూతురు తమ్ముడిని ఎత్తుకెళ్ళి చాలా ఘోరం చేశాడు. ఇతను చేసిన పని అందరూ నివ్వెరపోయేలా చేస్తోంది.
పెళ్ళిళ్ళలో వియ్యంకుల దగ్గర మాట రాకూదని అమ్మాయి తండ్రి(bride father) తనకు సాధ్యమైనంత వరకు ఏ లోటు జరకుండా, ఎలాంటి తప్పులూ దొర్లకుండా చూస్తుంటాడు. కానీ దురదృష్టం కొద్దీ ఏదో ఒక లోపం బయటపడుతూ ఉంటుంది. మగపెళ్లివారు కాస్త మంచివారు అయితే ఇలాంటి లోపాలను పట్టించుకోరు. కానీ ఇదిగో ఈ పెళ్ళి కొడుకులా ఉంటే మాత్రం పెళ్ళిమండపం అంతా గందరగోళమే అవుతుంది. భోజనంలో స్వీట్లు(Sweets) బాలేవనే కారణంతో ఓ పెళ్లికొడుకు(groom) పెళ్ళికూతురు కుటుంబం(bride family)తో గొడవకు దిగాడు. అంతటితో ఊరుకోకుండా 9ఏళ్ళ పెళ్లికూతురు తమ్ముడిని(bride's 9years old brother) ఎత్తుకెళ్ళి చాలా ఘోరం చేశాడు. ఇతను చేసిన పని అందరూ నివ్వెరపోయేలా చేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం లక్నో జిల్లాలో(Lucknow) పహార్పూర్ కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తికి మీరట్ జిల్లా(Meerut) అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్ళి కుదిరింది. పెళ్లి సందర్బంగా వరుడు అమ్మాయి గ్రామానికి బరాత్(barat) తో చేరుకున్నాడు. ఆరోజు రాత్రి ఏర్పాటుచేసిన విందులో అందరికీ స్వీట్లు కూడా వడ్డించారు(serving sweets in dinner). అయిచే ఆ స్వీట్ల నాణ్యత బాగాలేకపోవడంతో వరుడు వధువు కుటుంబంతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో అమ్మాయి తరపున వారు వరుడికి నచ్చజెప్పాలని చూశారు. కానీ అబ్బాయి తరపున వారు ఎవరూ వెనక్కు తగ్గలేదు. ఎవ్వరూ ఎవరిమాటా లెక్కచేయకపోవడంతో అక్కడి బంధువులలో ఒకరు తమ దగ్గరున్న నాటు తుపాకీ(country rifile) తీసి గాల్లోకి కాల్పులు జరిపారు. తుపాకీ శబ్దానికి గొడవ ఆగుతుందనేది వారి ఆలోచన. కానీ తుపాకీ పేలిన శబ్జం వినగానే వరుడు అతని వైపు వారు మరింత రెచ్చిపోయారు.
Viral Video: పిల్లలకోడి కోపాన్ని ఎప్పుడైనా చూశారా?? ఏకంగా డేగను ఎలా మూలన కూర్చోబెట్టిందో మీరే చూడండి..
విందులో అందరికీ నీళ్ళు అందిస్తున్న 9ఏళ్ళ వధువు తమ్ముడిని ఎత్తుకుని కారు ఎక్కారు. పిల్లాడిని ఎత్తుకుపోతున్నారని అమ్మాయి తరుపున ఇద్దరు మహిళలు ఆ కారుకు అడ్డు వెళ్ళారు. అయితే వరుడు అతని ఇద్దరు స్నేహితులు కారును ఆపకపోగా ఆ ఇద్దరు మహిళల మీద కారును పోనిచ్చారు. దీంతో ఆ మహిళలకు గాయాలయ్యాయి. వారు పిల్లాడిని ఎత్తుకెళ్లినప్పటినుండి వధువు తల్లిదండ్రులు, బంధువులు వరుడికి చాలా సార్లు ఫోన్ చేశారు. పిల్లాడిని క్షేమంగా తీసుకురమ్మని చాలా బతిమాలారు. కానీ మరుసటిరోజు తెల్లవారు జామున 3గంటల సమయంలో కారులో వచ్చి పిల్లాడి మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దీంతో వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వరుడు అతని స్నేహితులు తమ మహిళల మీద కారు పోనివ్వడమే కాకుండా.. తన 9ఏళ్ళ కొడుకును చంపారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.పిల్లాడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామని రిపోర్ట్ వచ్చినతరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.