Share News

Most Expensive Vegetable: భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయ ఇదే.. ఒక్క కిలో ధర ఎంతో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-11-22T20:20:44+05:30 IST

కొన్ని నెలల క్రితం భారతీయులను టమాటో భయపెట్టింది. కిలో ఏకంగా రూ.200 వరకు వెళ్లిపోయింది. అంతకు ముందు ఉల్లి ధర కంట తడి పెట్టించింది. ఉల్లి, టమాటో ధరలు ఏడాదిలో రెండు, మూడు నెలలు మాత్రం ఖరీదుగా మారతాయి. బ్రకోలీ, పుట్టగొడుగులు, బీన్స్ వంటివి ఎప్పుడూ ఖరీదైన కూరగాయలే.

Most Expensive Vegetable: భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయ ఇదే.. ఒక్క కిలో ధర ఎంతో తెలిస్తే..!

కొన్ని నెలల క్రితం భారతీయులను టమాటో (Tomato) భయపెట్టింది. కిలో ఏకంగా రూ.200 వరకు వెళ్లిపోయింది. అంతకు ముందు ఉల్లి (Onion) ధర కంట తడి పెట్టించింది. ఉల్లి, టమాటో ధరలు ఏడాదిలో రెండు, మూడు నెలలు మాత్రం ఖరీదుగా మారతాయి. బ్రకోలీ, పుట్టగొడుగులు, బీన్స్ వంటివి ఎప్పుడూ ఖరీదైన కూరగాయలే. అయితే భారతదేశంలో విక్రయించే అత్యంత ఖరీదైన కూరగాయలు ఏవో మీకు తెలుసా? ఆ ఖరీదైన కూరగాయ పేరు కేర్ సాంగ్రీ (ker sangri). ఈ కేర్ సాంగ్రీ రాజస్థాన్‌లో (Rajasthan) మాత్రమే లభ్యమవుతుంది.

సన్నటి నూడుల్స్ లాగా కనిపించే ఈ కేర్ సాంగ్రీలో పసుపు, ఉప్పు, మసాలా దినుసులు కలిపి వేయిస్తారు. మిలెట్ రోటీతో ఈ కూరను కలిపి తింటే రుచి అదిరిపోతుందట. jaipurfoodieandtravel అనే ఇన్‌‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ కేర్ సాంగ్రీకి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఒక కేజీ కేర్ సాంగ్రీ ఖరీదు దాదాపు రూ.1100 వరకు ఉంటుంది. సామాన్యులు ఈ కూరను వండుకుని తినడం కాస్త కష్టమే. ఈ కేర్ సాంగ్రీలో మంచి పోషక విలువలు కూడా ఉంటాయట (Rajasthan Food). ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

Viral Video: ఇలాంటి వాళ్లను ఏం చేయాలి..? స్కూటీపై వెళ్తూ ఇదేం పనయ్యా బాబూ..!

ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 61 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``కేర్ సాంగ్రీ రుచి చాలా బాగుంటుంది``, ``ఈ ప్రపంచంలోనే రాజస్థానీ ఫుడ్ చాలా బెస్ట్``, ``హిమాచ్‌ల్‌లో మాత్రమే దొరికే గుచ్చి మష్రూమ్ కూడా చాలా ఖరీదైనదే``, ``జైపూర్‌లో కేర్ సాంగ్రీతో మంచి వంటలు చేస్తారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-22T20:20:46+05:30 IST