Indian Railways: భారతీయ రైల్వేకు అసలు ఆదాయం ఎలా వస్తుంది..? టికెట్ల రూపంలో వచ్చేది కొంతే కానీ..!
ABN , First Publish Date - 2023-08-30T16:02:47+05:30 IST
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి భారతీయ రైల్వే. దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు భారతీయ రైల్వేలో సేవలు అందిస్తున్నారు. భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ సుమారు 3 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి భారతీయ రైల్వే (Indian Railway). దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు భారతీయ రైల్వేలో సేవలు అందిస్తున్నారు. భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ సుమారు 3 కోట్ల మంది ప్రయాణికులు (Railway Passengers) ప్రయాణిస్తున్నారు. ఇంత పెద్ద నెట్‌వర్క్‌ను నిర్వహించడానికి, అంత మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రైల్వేకు తగినంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? టిక్కెట్ల ద్వారానే రైల్వే ఎక్కువ సంపాదిస్తుంది అనుకుంటే పొరపాటే.
టిక్కెట్ల (Railway Tickets) ద్వారా రైల్వేకు వచ్చేది చాలా తక్కువ. పైగా అందులో వివిధ కారణాలతో ఇచ్చే సబ్సిడీలే ఎక్కువ. రైల్వే అనేక ఇతర సేవలను కూడా అందిస్తుంది. రైల్వేకు గూడ్స్ రైళ్ల (Goods Trains) ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆ తర్వాత ప్లాట్‌ఫారమ్‌పై ప్రకటనలు, స్టేషన్‌లోని దుకాణాల నుంచి ఛార్జీలు వసూలు చేయడం, సినిమా షూటింగ్‌ల కోసం స్థలాలు ఇవ్వడం ద్వారా రైల్వే శాఖ కోట్లాది రూపాయలు ఆర్జించింది. వీటన్నింటిలో, రైల్వేకు సరుకు రవాణా ద్వారా అత్యధిక ఆదాయం సమకూరుతోంది. వాటి ద్వారా భారతీయ రైల్వే (Railway Income) ఏడాదికి ఎంత సంపాదిస్తోందో తెలుసా?
Viral Video: రోడ్డుపై పడి ఉందో పర్సు.. ఎవరో పారేసుకున్నారని దాన్ని తీసుకుని ఓపెన్ చేసిన మహిళకు షాకింగ్ ట్విస్ట్..!
రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే రూ. 2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆదాయం రూ.49 వేల కోట్లు ఎక్కువ. దీనిలో భారతీయ రైల్వే గరిష్టంగా 1.62 లక్షల కోట్ల రూపాయలను సరుకు రవాణా ద్వారా ఆర్జించింది. దీని తరువాత, టిక్కెట్ల ద్వారా రూ.63,300 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలినది ఇతర ఆదాయం రూపంలో వచ్చింది. ప్లాట్‌ఫారమ్‌పై ప్రకటనలు, దుకాణాల ద్వారా వచ్చే ఆదాయం ఇందులో ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులను తీసివేసిన తర్వాత, మిగిలిన లాభాన్ని రైల్వే అభివృద్ధికి కేటాయించారు.