Thyroid Problems: ఒక్క థైరాయిడ్ వల్ల మహిళల్లో ఏకంగా ఇన్ని సమస్యలా..? మెడిసిన్స్ వాడకుండానే పరిష్కార మార్గాలేంటంటే..!
ABN , First Publish Date - 2023-10-04T15:50:37+05:30 IST
థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతినడం వల్ల మహిళల ఆరోగ్యం మొత్తం తలకిందులైపోతుంది. ఇది క్రియేట్ చేసే ఆరోగ్య సమస్యలు ఒకటి రెండూ కాదు.. దీన్ని మందుల్లేకుండా పరిష్కరించాలంటే ఇవి ఫాలో కావాలి..
మనిషి శరీరంలో ఉన్న ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి ఒకటి. ఈ గ్రంథి మెడలోపల సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది శరీరంలో వివిధ రకాల పనులు నిర్వహించే హార్మోన్లను విడుదల చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతినడం వల్ల మహిళల ఆరోగ్యం మొత్తం తలకిందులైపోతుంది. అసలు ఈ థైరాయిడ్ దెబ్బతినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేవి? మెడిసిన్స్ అక్కర్లేకుండానే థైరాయిడ్ సమస్యను పరిష్కరించుకోవడానికి మార్గాలేమిటి? తెలుసుకుంటే..
థైరాయిడ్(thyroid) గ్రంథి పనితీరు దెబ్బతినడం వల్ల మహిళలలో రుతు సంబంధ సమస్యలు ఎదురవుతాయి. నెలసరి ఆలస్యంగా రావడం, ఎక్కువ కాలం పాటు రుతుస్రావం జరగడం జరుగుతుంది. పిల్లలు పుట్టడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. అండాలు ఫలదీకరణ చెందడంలో ఆటంకం కలిగిస్తాయి. థైరాయిడ్ ఉన్న మహిళలు గర్బం ధరించినా గర్భస్రావం, ముందుగానే డెలివరీ కావడంతో పాటు ప్రసావానంతరం రక్తస్రావం అధికంగా ఉండటం సంభవించి తల్లీ బిడ్డలకు ఇద్దరికీ ప్రాణ ప్రమాదాన్ని కలిగిస్తుంది. గర్బాశయంలో నీటి తిత్తుల వంటి సమస్యలకు కూడా కారణం అవుతుంది. థైరాయిడ్ పనితీరు అధికంగా ఉన్నవారిలో పాల ఉత్పత్తి ఉంటుంది.
థైరాయిడ్ సమస్య ఉన్న మహిళలు 40ఏళ్ళ లోపే మెనోపాజ్ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇది శరీరంలో అధిక వేడి, నిద్రలేమి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు కారణమవుతుంది.
7 Bad Habits: ఈ 7 చెడు అలవాట్లే మీ శరీరాన్ని రోగాలకు నిలయంగా చేస్తున్నాయని తెలుసా..? షుగర్ నుంచి గుండె సమస్యల వరకు..!
థైరాయిడ్ ఉన్న మహిళలలో ప్రధానంగా కనిపించే 8 లక్షణాలు..
*ఆందోళన, అశాంతి, భయం.
*బరువు పెరగడం లేదా తగ్గడం,
*గొంతు దగ్గర వాపు
*కండరాల బలహీనత
*రుతుస్రావం సక్రమంగా లేకపోవడం
*కంటిచూపు సమస్యలు
*అలసట, జుట్టు పొడిబారిపోవడం రాగి రంగులోకి మారిపోవడం
*గొంతు స్వరంలో మార్పులు మొదలైన ఇతర లక్షణాలు కనిపిస్తాయి.
థైరాయిడ్ ఎలా పరిష్కరించుకోవాలంటే..
థైరాయిడ్ ఉన్నవారిలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు మెయింటైన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. చెడు అలవాట్లు వదిలేయాలి. బయటి ఆహారాలు, స్వీట్లు, బేకరీ ఫుడ్స్ మానేయాలి. క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ థైరాయిడ్ సమస్యను పెంచుతుంది. కాబట్టి వాటికి దూరం ఉండాలి.
ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం వల్ల థైరాయిడ్ ను తగ్గించుకోవచ్చు. యోగా, ధ్యానం ప్రాక్టీస్ చేస్తుంటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ప్రతిరోజూ కొద్దిసేపు వ్యాయామం చేయడం కూడా ముఖ్యం. నిద్ర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ పాటిస్తే మెడిసిన్స్ అక్కర్లేకుండా థైరాయిడ్ పరిష్కారమవుతుంది.