Tigers Video: బస్సును చుట్టుముట్టిన పులులు.. గజగజ వణికిపోయిన ప్రయాణీకులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-08-03T10:07:12+05:30 IST
పులులు, సింహాలను దూరం నుండి చూసినా భయం వేస్తుంది. ఇక అవి నేరుగా చుట్టుముడితే తమకివే ఆఖరి గడియలు అనుకుంటారంతా. వీళ్లూ అదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు.
పులి, సింహం వంటి క్రూర జంతువుల గురించి విన్నా, వాటిని నేరుగా చూసినా చెప్పలేనంత భయం వేస్తుంది. ఇక అవి నేరుగా చుట్టుముడితే తమకివే ఆఖరి గడియలు అనుకుంటారంతా. జూ పార్క్ చూద్దామని బస్సులో వెళ్లిన కొందరికి షాకింగ్ అనుభవం ఎదురైంది. పెద్ద పులులు ఒక్కసారిగా ప్రయాణీకుల బస్సును చుట్టుముట్టాయి. ఈ సంఘటనతో బస్సులో వారంతా భయంతో వణికిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
క్రూర జంతువులంటే(Wild Animals) మనిషికి చాలా భయం. కానీ విచిత్రంగా వాటిని చూడటం పట్ల చాలా ఆసక్తి చూపిస్తారు. జూ కు వెళ్ళి బంధీలుగా ఉన్న జంతువులను దూరం నుండి చూసి కొందరు సంబరపడతారు. మరికొందరు వాటిని దగ్గరగా చూడాలని, వాటి మధ్య కొన్ని నిమిషాలైనా గడపాలని అనుకుంటారు. ఇలాంటి వారికోసం కొన్ని అనిమల్ పార్క్(Animal park) లు వింత ఏర్పాట్లు చేశాయి. పులులు, సింహాలు స్వేచ్చగా తిరుగుతూంటే వాటి మధ్యకు సందర్శకులను పంపి వారి ముచ్చట తీరుస్తాయి. అదే విధంగా కొందరు సందర్శకులు పెద్ద పులులను చూసేందుకు వెళ్లారు. పార్క్ నిర్వాహకులు సందర్శకులను బస్ లో పెద్ద పులుల మధ్యకు తీసుకెళ్ళారు. వీడియోలో సందర్శకుల బస్సు పులులు(Tigers) ఉన్న ప్రాంతంలోకి ఎంటర్ అవ్వగానే పులులు అలర్ట్ అయ్యాయి. తమ కళ్ళముందే అంతమంది మనుషులు కనబడేసరికి అవి రెచ్చిపోయాయి. వెంటనే సందర్శకులున్న బస్సును చుట్టుముట్టాయి(tigers surround the visitors bus). వారున్న బస్సు మెల్లిగా ముందుకు కదులుతుండగా ఆ పులులు బస్సు ఇనుప కడ్డీలు పట్టుకుని బస్సు వెంట నడిచాయి. పులులు అలా చుట్టుముట్టేసరికి ప్రయాణీకులు భయంతో పణికిపోయారు. కొందరు భయంతో కేకలు వేశారు కూడా. అయితే ఈ బస్సుకు ఓపెన్ విండోస్ లేకపోవడంతో ప్రయాణీకులకు ప్రమాదం తప్పింది. పులులు కూడా మనుషులు తమకు అందే అవకాశం లేదని అర్థం చేసుకుని కొన్ని క్షణాలలోనే తమ మానాన తాము సైలెంట్ అయిపోయాయి.
World's most Expensive Divorce: వామ్మో.. 6 లక్షల కోట్ల భరణమా..? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులు ఎవరివంటే..!
ఈ వీడియోను benerankucing అనే ఇన్స్టాగ్రామ్(Instagram) పేజీ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 'ఆ పులులు సందర్శకుల బస్సు చూసి తమకు ఆహారం వచ్చిందని అనుకున్నట్టున్నాయి' అని ఒకరు కామెంట్ చేశారు. ' పులి బస్సువెంటే నడుస్తూ బస్సులో ఎంతమంది ఉన్నారో లెక్కిస్తోంది' అని ఇంకొకరు చమత్కారం చేశారు. 'పులి కంటికి బస్సులో ఉన్నవాళ్లందరూ మాంసంలాగే కనబడుతుంటారు' అని మరొకరు సరదాగా అన్నారు.