Train Video: అది రైలా.. ఆర్టీసీ బస్సా..? ఫుల్లు స్పీడుతో ట్రైన్ దూసుకొస్తోంటే బ్రిడ్జిపైనే కూర్చున్న ముగ్గురు కుర్రాళ్లు.. చివరకు..!
ABN , First Publish Date - 2023-09-26T20:17:45+05:30 IST
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉండి, మరికొన్ని ఆసక్తికరంగా ఉండి నెటిజన్లను ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉండి, మరికొన్ని ఆసక్తికరంగా ఉండి నెటిజన్లను ఆకట్టుకుని బాగా వైరల్ (Viral Videos) అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు. ఆ వీడియోలో ముగ్గురు కుర్రాళ్లు చేసిన సాహసం చాలా మందికి ఆగ్రహం తెప్పిస్తోంది. mallu_yaathrikar అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Train Video) షేర్ అయింది. ఈ వీడియోను రాజస్థాన్ (Rajasthan)లోని చిత్రీకరించారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ప్రయాణీకులతో పూర్తిగా నిండిపోయిన ఒక ట్రైన్ (Train) కొండల మధ్య నుంచి ప్రయాణిస్తోంది. ఆ ట్రైన్ ఎంత ఫుల్‌గా ఉందంటే భోగీల పైనా, మెట్ల మీద కూడా ప్రయాణీకులు నిల్చుని ప్రయాణిస్తున్నారు. ఆ ట్రైన్ బ్రిడ్జీ మీదకు వస్తుండగా అక్కడ ముగ్గురు కుర్రాళ్లు నిల్చుని వీడియో తీస్తున్నారు. ఆ బ్రిడ్జి మీద తప్పుకోవడానికి కూడా చోటు లేదు. అయినా ట్రైన్ వచ్చే వరకు ఆ కుర్రాళ్లు అక్కడే నిలబడి వీడియో తీస్తున్నారు. ట్రైన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక కుర్రాడు భయపడి ముందుగానే దూకేశాడు. మరో కుర్రాడు మాత్రం ట్రైన్ తగలడంతో కింద పడిపోయాడు (Shocking Video).
Marriage Video: పెళ్లికి వచ్చిన బంధువులంతా అవాక్కయ్యేలా పక్కా ప్లాన్.. లాస్ట్ మినిట్‌లో బెడిసికొట్టిన వధూవరుల ఫీట్..!
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 6.6 లక్షల మందికి పైగా వీక్షించారు. ఎంతో మంది ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఈ వీడియోను రాజస్థాన్‌లోని గోరం ఘాట్ (Goram Ghat)లో చిత్రీకరించారు. ఇది రాజస్థాన్‌లోని ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో ఒకటి. ఈ ప్రకృతి రమణీయ ప్రదేశాన్ని రాజస్థాన్ కశ్మీర్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఈ మార్గంలో రైలు ప్రయాణం మధురానుభూతిని కలిగిస్తుంది. ఆరావళి కొండల మధ్య నిర్మితమైన ఈ మార్గాన్ని 1932లో అప్పటి మేవార్ మహారాణా సహాయంతో బ్రిటిష్ వారు నిర్మించారు.