Viral Video: ఉబెర్ డ్రైవర్ ఐడియాకు ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. సింప్లీ సూపర్బ్ అంతే..!

ABN , First Publish Date - 2023-08-11T13:52:33+05:30 IST

ఓ ఉబెర్ డ్రైవర్ (Uber Driver) తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఉబెర్ డ్రైవర్ ఐడియాకు అతని క్యాబ్ ఎక్కిన ప్యాసింజర్లు ఫిదా అవుతున్నారు.

Viral Video: ఉబెర్ డ్రైవర్ ఐడియాకు ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. సింప్లీ సూపర్బ్ అంతే..!

Viral Video: ఓ ఉబెర్ డ్రైవర్ (Uber Driver) తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఉబెర్ డ్రైవర్ ఐడియాకు అతని క్యాబ్ ఎక్కిన ప్యాసింజర్లు ఫిదా అవుతున్నారు. తన ట్యాక్సీలో జర్నీ చేసే వారు బోర్ ఫీల్‌కాకుండా మంచి ఐడియానే ఆలోచించాడు మనోడు. ఇంతకీ అతని ఐడియా ఏంటో తెలుసా? సింపుల్.. ఒక చిన్న పజిల్‌తో కూడిన వీడియో గేమ్ ఏర్పాటు చేశాడు. డ్రైవర్ పక్క సీటు బ్యాక్‌సైడ్ ఒక చిన్న డిజిటల్ తెరను ఏర్పాటు చేశాడు. దానిపై వీడియో గేమ్ ఆడుకునేలా సెటాప్ చేయడం జరిగింది. దాంతో ఆ ఉబెర్ క్యాబ్ ఎక్కిన ప్రయాణికులు ఎంచక్కా ఆ వీడియో గేమ్ (Video Game) ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇంకేముంది.. అలా జర్నీలో వీడియో గేమ్ ఆడుకుంటూ.. వారికి తెలియకుండానే వారివారి గమ్యస్థానాలకు చేరుతున్నారు. అందరిలా కాకుండా కూసింత వెరైటీగా ఆలోచించిన ఉబెర్ డ్రైవర్ వాలెస్‌ (Wallace) ను ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు. తన క్యాబ్ ఎక్కే ప్రయాణికులు జర్నీ సమయంలో బోరింగ్‌గా ఫీల్‌కాకుండా ఎంటర్టైన్ (Entertaine) చేస్తున్నందుకు మెచ్చుకుంటున్నారు. ఇప్పుడీ వాలెస్ ఉబెర్ క్యాబ్ తాలూకు వీడియో సోషల్ మీడియా (Social Media) లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 1.7 మిలియన్ల మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.

Punjab Shocker: అమానుషం.. ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా?.. తన పరువు తీసిందని కూతురిని అతి కిరాతకంగా..


Updated Date - 2023-08-11T13:52:33+05:30 IST