Udaipur Crime: ఒకవైపు భార్య, మరోవైపు గర్ల్‌ఫ్రెండ్.. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన కాసేపటికే కథలో పెద్ద ట్విస్ట్
ABN , First Publish Date - 2023-08-11T16:09:52+05:30 IST
పెళ్లైన వాళ్లు పక్కదారి పడితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మొదట్లో ఆ అనుభూతి అందంగా, ఆహ్లాదకరంగా అనిపించొచ్చు కానీ.. ఆ తర్వాత అసలైన నరకం మొదలవుతుంది..
పెళ్లైన వాళ్లు పక్కదారి పడితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మొదట్లో ఆ అనుభూతి అందంగా, ఆహ్లాదకరంగా అనిపించొచ్చు కానీ.. ఆ తర్వాత అసలైన నరకం మొదలవుతుంది. ఒకవైపు భాగస్వామి, మరోవైపు గర్ల్‌ఫ్రెండ్.. ఇద్దరి మధ్య నలిగిపోవాల్సి వస్తుంది. ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలీక.. ఆందోళనకు గురవుతారు. అప్పుడు లేనిపోని ఆలోచనలు పుట్టుకొస్తాయి. చివరికి చంపాలనో లేదా చావాలనిపించేంత పరిస్థితికి చేరుకుంటారు. ఇలా పక్కదారి పట్టిన వాళ్లు నేరాలకు పాల్పడ్డ సంఘటనలు ఇప్పటివరకూ ఎన్నో వెలుగు చూశాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే తెరమీదకి వచ్చింది. భార్య, ప్రియురాలి మధ్య నలిగిపోతూ వస్తున్న ఓ వ్యక్తి.. చివరికి ఆ టార్చర్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉదయ్‌పూర్‌కి చెందిన భరత్ మిశ్రా అనే 45 ఏళ్ల వ్యక్తి లోకల్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి చాలా సంవత్సరాల క్రితం కౌశల్య అనే మహిళతో వివాహం అయ్యింది. అయితే.. తనకు పెళ్లైనప్పటికీ బిన్సీ పరెరా అనే మరో మహిళతో ప్రేమాయణం నడుపుతున్నాడు. మొదట్లో ఆ ఇద్దరికీ తెలియకుండా భరత్ మేనేజ్ చేశాడు కానీ, కొంతకాలం తర్వాత ఈ విషయం భార్య కౌశల్యకి తెలిసిపోయింది. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇటు, ప్రియురాలి నుంచి కూడా భరత్‌కి ఒత్తిళ్లు పెరిగిపోయాయి. గురువారం మధ్యాహ్నం కూడా ప్రియురాలితో ఫోన్లో వాగ్వాదం జరిగింది.
ఇలా భార్య, ప్రియురాలి మధ్య నలిగిపోతూ వచ్చిన భరత్.. వారి టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు. గురువారం సాయంత్రం గోవర్ధన్ విలాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రియురాలి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు సూసైడ్ చేసుకోవడానికి ముందుకు.. తన చావుకి భార్య కౌశల్య, ప్రియురాలు బిన్సి అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. వాళ్లిద్దరు తన జీవితాన్ని సర్వనాశనం చేశారని, ప్రశాంతంగా ఉండే తన జీవితంలో నిప్పులు పోశారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ ఫేస్బుక్ పోస్ట్ ఆధారంగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.