Viral: చాక్లెట్లు దొంగతనం చేశాడు.. జైలు పాలయ్యాడు.. కారణమేంటంటే..
ABN , First Publish Date - 2023-07-23T20:01:11+05:30 IST
చాక్లెట్లు దొంగతనం చేసిన ఓ వ్యక్తికి బ్రిటన్ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. అదేంటి.. చాక్లెట్లు దొంగిలించినందుకు అంత శిక్ష పడిందా అని ఆశ్చర్యపోతున్నారా? అతను దొంగిలించిన చాక్లెట్లు ఒకటి, రెండు కాదు.. ఏకంగా 2 లక్షల చాక్లెట్లను దొంగిలించాడు. ఆ చాక్లెట్ల ఖరీదు అక్షరాలా రూ.42 లక్షలు.
చాక్లెట్లు (Chocolates) దొంగతనం చేసిన ఓ వ్యక్తికి బ్రిటన్ (Britain) కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. అదేంటి.. చాక్లెట్లు దొంగిలించినందుకు అంత శిక్ష పడిందా అని ఆశ్చర్యపోతున్నారా? అతను దొంగిలించిన చాక్లెట్లు ఒకటి, రెండు కాదు.. ఏకంగా 2 లక్షల చాక్లెట్లను దొంగిలించాడు. ఆ చాక్లెట్ల ఖరీదు అక్షరాలా రూ.42 లక్షలు. దీంతో ఆ వ్యక్తికి అంత భారీ శిక్ష పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన ఆ దొంగతనం జరిగింది (Crime News).
బ్రిటన్‌కు చెందిన జోబీ పూల్ అనే వ్యక్తి స్టఫోర్డ్ పార్క్ ఏరియాలోని ఓ లాజిస్టిక్ కంపెనీలోకి చొరబడి ``క్యాడ్‌బరీ క్రీమ్ ఎగ్స్`` (Cadbury creme eggs) చాక్లెట్లు ఉన్న పెద్ద పెట్టెను తన లారీలో వేసుకుని వెళ్లిపోయాడు. ఓ చెక్‌పోస్ట్‌ను కూడా దాటేశాడు. అయితే పోలీసులకు అనుమానం రావడంతో అతడి లారీని వెంబడించి పట్టుకున్నారు. అసలు విషయం తెలుసుకుని అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దాదాపు 6 నెలల పాటు విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తుది తీర్పు వెలువరించింది (Viral News).
Anand Mahindra: అత్యంత భయంకరమైన ప్రయాణం.. అక్కడకు వెళ్లాలని ఉంది.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!
జోబీ పూల్‌కు 18 నెలల జైలు శిక్షను విధించింది. ఇప్పటికే ఆరు నెలల శిక్ష అనుభవించాడు కాబట్టి, అతడు మరో 12 నెలలు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. అలాగే చివరి 9 నెలలు జైలులో ఉండాల్సిన అవసరం లేకుడా సంబంధిత అధికారుల నుంచి అనుమతి తెచ్చుకోవచ్చని వెసులుబాటు కూడా కల్పించింది.