పాపం.. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు.. నిండు గర్భిణి అయిన భార్యను డాక్టర్ వద్దకు తీసుకెళ్లి..
ABN , First Publish Date - 2023-01-12T15:47:35+05:30 IST
వారికి ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవల భార్య గర్భం దాల్చింది. త్వరలో తల్లి కాబోతున్నానని ఆమె ఎంతో మురిసిపోయింది. అయితే ఆ ఆనందం త్వరలోనే ఆవిరవుతుందని పాపం.. ఆమెకు తెలీదు. వైద్య పరీక్షల నిమిత్తం భార్యను..
వారికి ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవల భార్య గర్భం దాల్చింది. త్వరలో తల్లి కాబోతున్నానని ఆమె ఎంతో మురిసిపోయింది. అయితే ఆ ఆనందం త్వరలోనే ఆవిరవుతుందని పాపం.. ఆమెకు తెలీదు. వైద్య పరీక్షల నిమిత్తం భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ అనూహ్య ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
యువతిని బలవంతంగా లాక్కెళ్లిన వ్యక్తి.. వీడియోలో కాపాడండి అంటూ వేడుకోలు.. మరుసటి రోజు చూస్తే..
రాజస్థాన్ (Rajasthan) బుండీ జిల్లా పరిధి బన్సీ అనే ప్రాంతానికి చెందిన ఓం ప్రకాష్ (27)కు.. లచ్చాదేవి(24) అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. కాగా, ఇటీవల లచ్చాదేవి గర్భం (pregnancy) దాల్చింది. కొద్ది రోజుల్లో ఆమె ప్రసవించాల్సి ఉండగా.. ఇటీవల ఓ రోజు ఆమెకు కడుపు నొప్పి వచ్చింది. దీంతో ప్రకాష్.. తన భార్యను వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. చికిత్స అనంతరం ఆమెకు మరిన్ని పరీక్షలు (Medical tests) చేసేందుకు గురువారం కూడా ఆస్పత్రికి రావాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రకాష్ బుధవారం రాత్రి తన అత్తగారి ఇంట్లోనే బస చేసి, గురువారం భార్యను మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
వరుడు ఇష్టం లేదంటూనే పెళ్లి చేసుకున్న యువతి.. చివరకు అసలు విషయం చెప్పడంతో..
అయితే మార్గ మధ్యలో అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో (road accident) ప్రకాష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన లచ్చాదేవిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. వీరి బైకును మరో వాహనం ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందా.. లేక పశువులను ఢీకొట్టడం వల్ల ఇలా జరిగిందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్ ఉండి ఉంటే ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడేవారని పోలీసులు తెలిపారు. దపంతుల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
ప్రియుడితో వివాహిత వీడియో కాలింగ్.. అతను రెచ్చగొట్టడంతో.. మధ్యలో ఉన్నట్టుండి ఆమె చేసిన పని..