పొట్టి దుస్తులు ధరించి బయటకు వెళ్లిందని భార్యపై భర్త ఆగ్రహం.. ఎంత చెప్పినా వినకపోవడంతో ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2023-03-15T15:24:54+05:30 IST

రోజులు ఎంతలా మారినా, మహిళలు భారీగా సంపాదిస్తున్నా వారు కట్టుబాట్లలోనే ఉండాలని చాలా మంది పురుషులు భావిస్తుంటారు. ముఖ్యంగా భార్య పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగానే ఉండాలని ఆంక్షలు విధిస్తుంటారు.

పొట్టి దుస్తులు ధరించి బయటకు వెళ్లిందని భార్యపై భర్త ఆగ్రహం.. ఎంత చెప్పినా వినకపోవడంతో ఏం చేశాడంటే..

రోజులు ఎంతలా మారినా, మహిళలు భారీగా సంపాదిస్తున్నా వారు కట్టుబాట్లలోనే ఉండాలని చాలా మంది పురుషులు భావిస్తుంటారు. ముఖ్యంగా భార్య పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగానే ఉండాలని ఆంక్షలు విధిస్తుంటారు. భార్య ధరించే బట్టలు కూడా తమకు నచ్చాలని పట్టుబడుతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన ఓ మహిళ పొట్టి దుస్తులు ధరించి పబ్లిక్‌ ప్లేస్‌లో తిరిగినందుకు భర్త చేతిలో హత్యకు గురైంది. ఈ వార్త స్థానికంగా సంచలనంగా మారింది (Crime News).

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లోని ఘాజీపూర్ గ్రామానికి చెందిన మోహిత్‌ కుమార్, సప్నా (28) దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మోహిత్‌ కుమార్ తరచూ తన భార్యతో ఆమె వస్త్రధారణ గురించి (Glamorous Dress) గొడవపడేవాడు. పొట్టి దుస్తులు వేసుకుని బయటకు వెళ్లవద్ధని భార్యకు హితబోధ చేసేవాడు. అయితే భర్త మాటలను సప్నా పట్టించుకోకుండా తనకు నచ్చినట్టు దుస్తులు వేసుకునేది. ఈ క్రమంలో సోమవారం కూడా వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Shocking: రక్తపు వాంతులు చేసుకున్న యువకుడి స్కానింగ్ రిపోర్ట్ చూసి షాకైన డాక్టర్లు.. అవి లోపలకి ఎలా వెళ్లాయో తెలిస్తే..

భార్య ప్రవర్తనతో ఆవేశానికి గురైన మోహిత్‌ పదునైన ఆయుధంతో సప్నాపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసేశాడు (Husband Killed Wife). దీంతో సప్నా అక్కడికక్కడే మృతి చెందింది. ఇరుగుపొరుగు సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తం మడుగులో అచేతనంగా పడి ఉన్న సప్నా మృతదేహం పక్కన మోహిత్ కూర్చుని ఉన్నాడు. అసభ్యంగా వస్త్రాలు ధరించి పబ్లిక్‌ ప్లేస్‌లో తిరగవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా భార్య తన మాట విన లేదని, అందుకే ఆమెను హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడు మోహిత్‌ను అరెస్టు చేశారు.

Updated Date - 2023-03-15T15:24:54+05:30 IST