Viral News: ఒక్క ఐడియా.. ఈమె జీవితాన్నే మార్చేసింది.. ఇంట్లోంచి కాలు బయటకు పెట్టకుండానే లక్షలు సంపాదిస్తోంది..!
ABN , First Publish Date - 2023-11-27T16:03:22+05:30 IST
ఇంటర్నెట్ బాగా వినియోగంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవన స్థితిగతులు, ఆలోచనా ధోరణీ మారిపోయాయి. ఇంటి నుంచే చాలా పనులు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాకుండా.. చాలా మందికి డబ్బు సంపాదించుకునే ఆదాయ వనరుగా కూడా మారింది.
ఇంటర్నెట్ (Internet) బాగా వినియోగంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవన స్థితిగతులు, ఆలోచనా ధోరణీ మారిపోయాయి. ఇంటి నుంచే చాలా పనులు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ (Youtube) అనేది ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాకుండా.. చాలా మందికి డబ్బు సంపాదించుకునే ఆదాయ వనరుగా కూడా మారింది. ఎంతో మంది స్వంతంగా యూట్యూబ్ ఛానల్స్ (Youtube Channel) స్టార్ట్ చేసుకుని తమ ట్యాలెంట్ ప్రదర్శించి వేలల్లో, లక్షల్లో సంపాదిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంగ్లీష్ పాఠాలు (English lessons in Youtube) చెబుతూ బాగా పాపులర్ అయింది.
కౌశాంబి జిల్లాలోని సిరతు నగర్‌కు చెందిన యశోద లోధి (Yashoda Lodhi) అనే మహిళ ``ఇంగ్లీష్ విత్ దేహతీ మేడమ్`` (English with Dehati Madam) అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. యూపీ గ్రామీణ మహిళ పద్ధతిలో చీర, బింధీ ధరించి తనలాంటి గ్రామీణ మహిళలకు స్పోకెన్ ఇంగ్లీష్, గ్రామర్ నేర్పుతుంటుంది. 2022 మేలో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన లోధి ఇప్పటివరకు 368 వీడియోలను అప్‌లోడ్ చేసింది. ఆమె యూట్యూబ్ ఛానెల్‌కు మొత్తం 2.85 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
Indian Railway: భర్తతో కలిసి రైల్వే స్టేషన్‌కు వెళ్లిందో భార్య.. అప్పటికే ఎక్కాల్సిన ట్రైన్ మిస్.. మరో రైలు కోసం ఎదురు చూస్తోంటే..!
ఇంగ్లీష్ గ్రామర్‌తో పాటు, సంకోచం లేకుండా ఆంగ్లంలో ఎలా మాట్లాడాలి, రోజువారీ పనులను చేసుకుంటూనే ఆంగ్లం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇంట్లో ఇంగ్లీషు మాట్లాడే వాతావరణాన్ని ఎలా సృష్టించాలి వంటి అంశాలను చెబుతూ వీడియోలను అప్‌లోడ్ చేసింది. అంతేకాదు ఆమె తన వ్యక్తిగత జీవితం, ఇల్లు, పశువులు మొదలైన అన్ని విషయాలనూ సబ్‌స్క్రైబర్లతో పంచుకుంటుంటుంది. యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈమె భారీగా సంపాదిస్తోంది. నెలకు రూ.లక్షపైనే ఆమె ఆదాయం ఉన్నట్టు సమాచారం.