UPI payments: ఫోన్ పే.. గూగుల్ పే నుంచి పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపితే.. తిరిగి రాబట్టుకోవడానికి ఏం చేయాలంటే..!
ABN , First Publish Date - 2023-06-09T11:00:00+05:30 IST
ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు పంపేయడం, పొరపాటున ఒకరికి పంపబోయి మరొకరికి పంపడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు అందరూ చాలా కంగారు పడిపోతారు. డబ్బు తిరిగి రాబట్టుకోవడంలో విఫలం అవుతుంటారు. అయితే
ప్రస్తుతం ఆన్లైన్ చెల్లింపుల హవా పెరిగింది. ఒకప్పుడు దూరంగా ఉన్నవారికి డబ్బు పంపడానికి ఈ డిజిటల్ చెల్లింపుల మార్గం అనుసరించేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. రోజువారీ చిన్న చిన్న చెల్లింపులను కూడా పోన్ పే, గూగుల్ పే, పేటియం వంటి యాప్స్ ద్వారా చెల్లించేస్తున్నారు. ఇది చాలా సులువైన మార్గం అయినా కొన్ని సార్లు తప్పులు జరిగిపోతాయి. ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు పంపేయడం, పొరపాటున ఒకరికి పంపబోయి మరొకరికి పంపడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు అందరూ చాలా కంగారు పడిపోతారు. డబ్బు తిరిగి రాబట్టుకోవడంలో విఫలం అవుతుంటారు. అయితే అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పొరపాటున పంపేసిన డబ్బును తిరిగి సులువుగానే పొందవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే..
డిజిటల్ పేమెంట్లు(digital payments) చేసేటప్పుడు యుపిఐ ఐడి(UPI ID) లు తప్పుగా కొట్టడం వల్లో, ఒకే విధమైన పేర్లు తారసపడటం వల్లో చెల్లించాల్సిన వారికి బదులు ఇంకొకరికిపంపేస్తుంటాం. ఇలా పంపేసినప్పుడు డబ్బు చేజారిపోయాయే అని భయపడాల్సిన, బాధపడాల్సిన పనిలేదు. గూగుల్ పే(Google Pay), ఫోన్ పే(Phone pe), పేటియం(Paytm) వంటి యుపిఐ చెల్లింపులలో పొరపాటున(mistake upi payments) ఎవరికైనా ఎక్కువ డబ్బు పంపేసినప్పుడు మొదట ఆయా ప్లాట్ ఫామ్ ల కస్టమర్ కేర్(UPI apps customer care) కు కాల్ చేయాలి. వారితో పొరపాటుగా జరిగిపోయిన లావాదేవీల గురించి వివరంగా చెప్పి ఫిర్యాదు చేయాలి. ఇలా ఫిర్యాదు చేసిన తరువాత డబ్బు కట్ అయిన సదరు బ్యాంక్ కు వెళ్ళాలి. ఆ బ్యాంకులో డబ్బు పొరపాటున ఎక్కువ పంపేసినట్టు ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తే డబ్బును 48గంటల్లో తిరిగి పొందవచ్చు(money return within 48hours). ఈ విషయాన్ని ఆర్బీఐ స్పష్టం చేసింది కూడా. డబ్బు ఎక్కువగా పంపేసిన 3రోజులలోపు ఈ పని చేస్తేనే పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందగలుగుతారు.
Viral Video: వామ్మో.. ఇదేం టెక్నిక్ బాబోయ్.. నోట్ల కట్టకు వేసిన సీల్ తీయకుండానే రూ.500 నోటును ఓ వ్యక్తి ఎలా తీశాడో చూస్తే..
ఆన్లైన్ లోనే యుపిఐ పేమెంట్స్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పొరపాటున మరొక వ్యక్తికి డబ్బు పంపితే(money send mistake to another person) మొదట 18001201740 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ఆ తరువాత డబ్బు కట్ అయిన బ్యాంకుకు వెళ్ళి విషయం మొత్తాన్ని సంబంధిత ఫారమా్ లో నింపి బ్యాంకు వారికి ఇవ్వాలి. ఒకవేళ బ్యాంకు వారు సహకరించకపోయినా, సహాయం చెయ్యడానికి నిరాకరించినా bankingombudsman.rbi.org.in వెబ్సైట్ లోకి వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్‌మన్‌కి(Reserve bank of ombudsman) ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు సమయంలో PPBL నెంబర్ అవసరం అవుతుంది. కాబట్టి లావాదేవీకి సంబంధించి మెసేజ్ ను మొబైల్ నుండి ఎట్టిపరిస్థితిలోనూ తొలగించకూడదు(don't delete transection messages). ఇలా డబ్బు పొరపాటుగా ఇతరులకు పంపిన విషయం గురించి నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(National corporate of India)(NCPI) వెబ్సైట్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇకపోతే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే చెల్లింపులు చేసేటప్పుడు, నగదు బదిలీ చేసేటప్పుడు యుపిఐ ఐడి, ఫోన్ నెంబర్లు, పేర్లు వంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.